మెరీనా బీచ్ లో రేపు అంత్యక్రియలు..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు రేపు జరుగుతాయని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మెరీనా బీచ్ లో జయ అంత్యక్రియలు ఉంటాయని తెలిపారు. నేడు జయ పార్థివదేహాన్ని రాజాజీ పబ్లిక్ హాల్ లో ఉంచనున్నారు.

జయకు నివాళి అర్పించడానికి నేడు ప్రముఖులు చెన్నైకి రానున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు జయ కు నివాళి అర్పించడానికి రానున్నారు.

జయ మరణంతో అన్నాడీఎంకే శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. భావోద్వేగాల స్థాయి ఎక్కువగా ఉండే తమిళులపై జయ మరణం తీవ్రమైన ప్రభావం చూపిస్తోందనే చెప్పాలి. జయ ఆరోగ్యం గురించి ఆందోళనతోనే కొంతమంది మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. జయ మరణించారన్న విషయం ఆమెను అమ్మగా ఆరాధించే వారిని మరింత క్షోభకు గురి చేస్తోంది. అంత్యక్రియల నేపథ్యంలో రేపు మెరీనాబీచ్ జనసంద్రం కానుంది. 

Readmore!
Show comments

Related Stories :