దేవినేని.. ఆ ఉద్వేగం ఇప్పుడు లేదా?

ఎన్టీఆర్ పై చంద్రబాబు ఎలాంటి భాష వినియోగించేవాడో.. వివరించి చెప్పింది దేవినేని నెహ్రూనే! 

ఇప్పుడైతే బాబు ఎన్టీఆర్ ను దేవుడు అంటున్నాడు కానీ.. వెన్నుపోటు కాలంలో సొంత మామను, ఆయన తనయులను చంద్రబాబు “మొద్దు లం***లు’’ అని అన్నాడని, తనతో మాట్లాడుతూ, ఎన్టీఆర్, హరికృష్ణ లను తిడుతూ బాబు  వారిని అలా సంబోధించాడని దేవినేని నెహ్రూ స్వయంగా వివరించాడు. 

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, దేవుడి ఫొటోల బదులుగా ఎన్టీఆర్ దేవుడి వేషాల్లో ఉన్న ఫొటోలను పెట్టుకుంటారు అని..  తెలుగుదేశం అభిమానులు చెప్పుకొంటూ ఉంటారిప్పటికీ.. మరి అలాంటి వ్యక్తి ని పట్టుకుని, కనీసం పిల్లనిచ్చిన మామ అని కూడా చూడకుండా అంతటి బూతు మాటల తో దూషించడమంటే.. ప్రస్తుత తెలుగుదేశం అధినేత నైజం ఏమిటో సులభంగానే అర్థం చేసుకోవచ్చు.

రాయడానికి, అయిన వారి మధ్య మాట్లాడటానికి కూడా ఉపయోగించే మాటలతో ఎన్టీఆర్ అంతటి మామను తిట్టడం అంటే.. అది అల్లాటప్పా మనుషులకు సాధ్యం అయ్యే పనేం కాదు!

ఇలా బాబుగారు ఎన్టీఆర్ ను దూషించిన తీరును, ఆయనను పదవి నుంచి దించిన తీరును, ఆయనపై చెప్పులు వేయించిన తీరును చెప్పుకుని కళ్లలో నీళ్లు పెట్టుకున్న వ్యక్తి దేవినేని నెహ్రూ. ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేసిన తీరు గురించి  గద్గద స్వరంతో వివరిస్తూ ఒక దశలో మాటలాగిపోయేంత భావోద్వేగానికి గురి అయ్యాడు ఈ నేత. అది కూడా వెన్నుపోటు ఎపిసోడ్ జరిగిన దశాబ్దంన్నర తర్వాత కూడా దేవినేని  అంత బావోద్వేగభరితమయ్యాడు.

మరి ఇప్పుడిప్పుడు పాత భావోద్వేగాలన్నీ వదలినట్టుగా ఉన్నాయి దేవినేనికి. ఈయన తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమైంది.  తన తనయుడితో కలిసి నెహ్రూ చంద్రబాబును కలిశాడు. పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటాం అనే రీతిలో సాగుతున్న తెలుగుదేశం అధినేత నెహ్రూ కు పచ్చకండువా వేయడమే మిగిలింది ఇక.

మరి రాజకీయాల్లో ఇవన్నీ మామూలే.. అనుకోవచ్చు కానీ, ఇదీ బాబు నైజం అంటూ.. ఎన్టీఆర్ మీద నికృష్టమైన పదాలను ఉపయోగించాడు అంటూ వివరించిన వ్యక్తి ఇప్పుడు బాబు పంచన చేయడం మాత్రం చోద్యమే! తెలుగుదేశంతో హత్యారాజకీయాలు కొనసాగించాడనే నేపథ్యం ఉన్న జేసీ దివాకర్ రెడ్డి చేరిక తర్వాత, ఇలాంటి చోద్యాలెన్నో కొనసాగుతున్నాయి. వాటిలో నెహ్రూ చేరిక కూడా ఒకటంతే! 

Show comments