ఆ ఒక్కటీ అడగొద్దు: విద్యాబాలన్‌

హీరోయిన్‌గా కెరీర్‌ మంచి జోరుమీదున్నప్పుడు 'పెళ్ళెప్పుడు.?' అని ప్రశ్నించేవారనీ, ఇప్పుడు ప్రెగ్నెన్సీ విషయంలో ప్రశ్నలు, గాసిప్స్‌ పుట్టుకొస్తున్నాయని బాలీవుడ్‌ బ్యూటీ విద్యాబాలన్‌ అంటోంది. పెళ్ళి, ప్రెగ్నెన్సీ ఏ మహిళ జీవితంలో అయినా చాలా ప్రత్యేకమైన సందర్భాలనీ, వాటి విషయంలో ప్రైవసీ చాలా ముఖ్యమని విద్యాబాలన్‌ అభిప్రాయపడింది. 

దురదృష్టవశాత్తూ సినిమా హీరోయిన్లకి ప్రైవసీ తక్కువగా వుండాలని అంతా అనుకుంటారనీ, తమ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాల్లో కొంత గోప్యత తాము కోరుకోవడం తప్పెలా అవుతుందని విద్యాబాలన్‌ ప్రశ్నిస్తోంది. వైవాహిక జీవితం చాలా ఆనందంగా వుందనీ, ప్రెగ్నెన్సీ విషయమై తమకంటూ కొన్ని ఆలోచనలు వున్నాయనీ, వాటి గురించి బహిరంగంగా మాట్లాడలేమని విద్యాబాలన్‌ క్లారిటీ ఇచ్చింది. 

'నాకు చాలాసార్లు పెళ్ళిళ్ళు చేసేశారు.. ప్రెగ్నెన్సీ విషయంలో అయితే లెక్కే లేదు.. చాలాసార్లు నన్ను ప్రెగ్నెంట్‌ని చేసేశారు.. ప్రెగ్నెన్సీ కన్‌ఫామ్‌ అయితే దాచడానికేమీ వుండదు కదా.. మాతృత్వం గొప్ప అనుభూతి.. చాలా గర్వంగా ప్రకటించుకునే సందర్భం..' అంటూ విద్యాబాలన్‌ పెద్ద క్లాసే పీకింది. సినిమాల్లో ఎప్పటికీ నటిస్తూనే వుండాలన్నది తన కోరిక అనీ, అటు కుటుంబానికి తగిన సమయం కేటాయిస్తూనే, ఇటు సినిమాలకు టైమ్‌ కేటాయిస్తానని విద్యాబాలన్‌ చెప్పుకొచ్చింది. 

పెళ్ళికాని హీరోయిన్లను ఉద్దేశించి పెళ్ళెప్పుడు.? అన్న ప్రశ్ననీ, పెళ్ళయిన హీరోయిన్లను ప్రెగ్నెన్సీ కన్‌ఫామ్‌ అయ్యిందట కదా.! అన్న ప్రశ్నలు మాత్రం వేయొద్దంటోంది విద్యాబాలన్‌. Readmore!

Show comments