సినిమా ఆడుతుందా? ఆడదా? అనే పాయింట్ కన్నా? డిఫరెంట్ గా వుందా? లేదా? అన్నదే చూసే హీరో నారా రోహిత్ మాత్రమే అనుకోవాలి. అతను చేసే సినిమాలన్నీ దాదాపు డిఫరెంట్ గానే వుంటాయి.
ఆఖరికి ఇప్పుడు లేటెస్ట్ గా ట్రయిలర్ విడుదల చేసుకున్న కథలో రాజకుమారి సినిమాతో సహా. మహేష్ సూరపనేని దర్శకత్వం వహించిన కథలో రాజకుమారి ట్రయిలర్ బయటకు వచ్చింది.
మాంచి కాన్ ఫ్లిక్ట్ లవ్ స్టొరీని నారా రోహిత్ ఈసారి అటెంప్ట్ చేసినట్లు కనిపిస్తోంది. సోలో సినిమాలో లవర్ గా కనిపించిన తరువాత మళ్లీ అలాంటి ప్రయత్నం చేయలేదు.
ఇప్పుడు ఆ ప్రయత్నం చేసినట్లున్నాడు. ట్రయిలర్ లో కథ మొత్తం ఏ జోనర్ లో వెళ్లబోతోందో? ఎలాంటి విషయాన్ని ఎలా డీల్ చేయబోతున్నారో, డైరెక్ట్ గా చెప్పేసే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.
సినిమాకు హీరో, సినిమాలో విలన్ అనే టైపు టిపికల్ క్యారెక్టరైజేషన్ తొంగి చూస్తోంది. చుట్టాలబ్బాయి ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నమితా ప్రమోద్ కు కాస్త హెవీ రోల్ నే దక్కినట్లుంది.
బలమైన డైలాగులు, ఎమోషన్ సీన్లు, రిచ్ లోకేషన్లు ట్రయిలర్ లో తొంగిచూసాయి. అన్నీ బాగానే వున్నాయి కానీ నారా రోహిత్ ఈ క్యారెక్టర్ కోసం ఇలా వున్నారో? లేక బరువు తగ్గడానికి ముందుచేసిన సినిమానో? మరీ బొద్దుగా కనిపిస్తున్నారు.