సన్నీలియోన్‌ తల్లి అయ్యిందిగానీ.!

ఒకప్పటి పోర్న్‌స్టార్‌, ఇప్పటి బాలీవుడ్‌ 'బాంబ్‌' సన్నీలియోన్‌ ఓ బిడ్డకు తల్లి అయ్యింది. అయితే, నవమాసాలు కడుపున మోసి కాదు, అనాధాశ్రమం నుంచి ఓ బిడ్డను దత్తత తీసుకోవడం ద్వారా. రెండేళ్ళ క్రితమే అనాధాశ్రమంలో సన్నీలియోన్‌, ఆమె భర్త డేనియల్‌ వెబర్‌ ఓ బిడ్డని దత్తత తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారట

 ఆ విషయాన్ని ఇప్పుడు తాజాగా సన్నీలియోన్‌ వెల్లడించింది. నిషా అనే చిన్నారిని దత్త తీసుకున్న సన్నీలియోన్‌, ఆ చిన్నారికి నిషా కౌర్‌ వెబర్‌ అని పేరు పెట్టింది. 

'కౌర్‌', సన్నీలియోన్‌ అసలు పేరు. కరణ్‌జీత్‌ కౌర్‌ వోరా - సన్నీలియోన్‌ అసలు పేరు కావడంతో, అందులోంచి 'కౌర్‌' అనే పదాన్నీ, తన భర్త డేనియల్‌ వెబర్‌లోని 'వెబర్‌'నీ తీసుకుని దత్త పుత్రిక నిషాకి ఆ రెండిటినీ లింక్‌ చేశారన్నమాట. 

బాలీవుడ్‌ ప్రముఖులు ఇలా చిన్నారుల్ని దత్తత తీసుకోవడం కొత్తేమీ కాదు. బాలీవుడ్‌ బ్యూటీ సుస్మితా సేన్‌ అయితే, పెళ్ళి కాకుండానే ఇద్దరు ఆడపిల్లలకు తల్లి అయ్యింది. ఇద్దరు అమ్మాయిల్ని సుస్మితా సేన్‌ దత్తత తీసుకుంది.

తనకు మగాడితో 'ఆ' అవసరం లేదన్నది ఆమె వాదన. మరోపక్క, లేటు వయసులోనూ కొందరు బాలీవుడ్‌ నటీనటులు సరోగసీ ద్వారా పిల్లల్ని పొందుతున్నారు. దత్తత తీసుకోవడం, సరోగసీ విధానం ద్వారా పిల్లల్ని కనడం.. ఇవన్నీ ఇప్పుడు బాలీవుడ్‌లో నయా ట్రెండ్‌ అనుకోవాలేమో.!

Show comments