హిట్ హీరోయిన్ కు మరోసారి హ్యాండ్..?

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. గర్ల్ నెక్ట్స్ డోర్ లుక్స్ తో తెలుగు ఆడియన్స్ కు బాగానే కనెక్ట్ అయింది. ఆ తర్వాత నేను లోకల్ సినిమాతో మరో హిట్ కూడా కొట్టింది. దీనికి తోడు ఏకంగా పవన్ కల్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ అందుకోవడంతో టాలీవుడ్ లో కీర్తి రేంజ్ అమాంతం పెరిగింది. అయితే ఆమె ఇమేజ్ ఎంత పెరిగినా మహేష్  సరసన నటించే అవకాశాన్ని మాత్రం మరోసారి మిస్ చేసుకుంది. 

త్వరలోనే కొరటాల శివతో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు మహేష్. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా కోసం మొదట కీర్తిసురేష్ ను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఇప్పుడు కొరటాల తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. మహేష్ సరసన మరో హీరోయిన్ కోసం వెదుకుతున్నాడట. గతంలో కూడా కీర్తి విషయంలో ఇలానే జరిగింది. మహేష్-మురుగదాస్ సినిమాలో హీరోయిన్ గా కీర్తి పేరు వినిపించినప్పటికీ.. ఆఖరి నిమిషంలో ఆమె స్థానంలో రకుల్ ను తీసుకున్నారు.

మహేష్ సినిమాలో ఛాన్స్ మిస్ అవ్వడానికి ముఖ్యంగా 2 కారణాలు చెబుతున్నారు. ఒకటి కీర్తి సురేష్ ప్రస్తుతం బిజీ అయిపోయింది. తెలుగు-తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. ఇక రెండో వాదన ఏంటంటే.. ఆమె ప్రొఫెషనల్ గా ఉండడం లేదని, చెప్పిన టైమ్ కు షూటింగ్ కు రాదని, కాల్షీట్లు కేటాయించే విషయంలో సమస్యలు సృష్టిస్తుందని, వీటికి తోడు ఈమధ్యే పారితోషికం కూడా భారీగా పెంచేసిందని అంటున్నారు. కారణాలు ఏమైనా, కీర్తికి మహేష్ సినిమా ఛాన్స్ మరోసారి మిస్ అయినట్టే. 

Show comments