ఉండవల్లి శల్య సారథ్యం?

ఉండవల్లి మాంచి వక్త అయితే అయి వుండొచ్చు. న్యాయవాది కూడా కదా? కానీ రాజకీయ చతురుడు మాత్రం కాదేమో? ఎందుకంటే రాజకీయాల్లో వ్యూహ రచన అన్నది పది కిలోమీటర్లు ముందుకు చూసి మరీ డిసైడ్ చేయాలి. అంతే కానీ, దుందుడుకు నిర్ణయాలు పనికిరావు. ఉండవల్లి ఇస్తున్న సలహా చూస్తుంటే, ఆయన జగన్ ను శల్య సారథ్యం చేయాలని ప్రయత్నిస్తున్నారా అని అనిపిస్తోంది.

కొడితే కుంభస్థలం కొట్టాలని, నేరుగా మోడీ మీదనే అవిశ్వాసం పెట్టాలని, అప్పుడు భాజపా వ్యతిరేక శక్తులు కలిసి వస్తాయని, మోడీ సమాధానం చెప్పక తప్పని స్థితి వస్తుందని అంటున్నారు ఉండవల్లి. కచ్చితంగా కేంద్రం ఇరుకున పడుతుందంటున్నారు. 

నిజమే. నిజంగా నిజమే. ఆయన స్ట్రాటజీ కరెక్టే. కానీ జగన్ రాజకీయ ఆలోచనలేమిటి? ఉండవల్లి మరీ ఇలాంటి సలహాలిస్తారేమిటి? పవన్ బాబును చంద్రబాబును తిట్టమన్నట్లు, చంద్రబాబును వెంకయ్యను నిలదీయమన్నట్లు? జగన్ ను మోడీని ఇరుకునపెట్టమని. ఇవి అయ్యే పనులేనా? జగన్ పదే పదే చంద్రబాబుకు మోడీ అన్నా కేంద్రం అన్నా భయం అని అన్నారు కానీ తనకు లేదు అని చెప్పలేదుగా?  ఉండవల్లికి ఆ మాత్రం రాజకీయం తెలియదా? ఈ సూక్ష్మం తెలిసే కదా? చంద్రబాబు నేరుగా కాకుండా పవన్ తో మోడీని టార్గెట్ చేయిస్తున్నది?

Show comments