సెంటిమెంట్ల చుట్టూ ఇజమ్

ఇజమ్ సినిమా విడుదల దగ్గరయింది. ఈ సినిమాలో కూడా దర్శకుడు పూరి జగన్నాధ్ మదర్ సెంటిమెంట్ కు పెద్ద పీట వేసారట. సినిమాలో మదర్ సెంటిమెంట్ కీలకంగా వుంటుందట. హరేరామ్ చిత్రంలో మదర్ సెంటిమెంట్, పూరి సినిమాల్లో మదర్ సెంటిమెంట్ లు బాగా వర్కవుట్ అయినందున ఈ సినిమాలో కూడా మదర్ సెంటిమెంట్ ను బాగా క్లిక్ అయ్యేలా చూసుకున్నారట.

ఇదిలా వుంటే సీనియర్ ఎన్టీఆర్ జయసింహ, కోడలు దిద్దిన కాపురం, యమగోల సినిమాలు అన్నీ అక్టోబర్ 21నే విడదులయ్యాయి. ఇజమ్ కు కూడా అనుకోకుండా అదే డేట్ సేట్ అయింది.

అందువల్ల కచ్చితంగా విజయం సాధిస్తామనే సెంటిమెంట్ యూనిట్ ను అలుముకుందట. సినిమాను కమిషన్, అడ్వాన్స్ ల మీద ఆడించడమే కాకుండా, ఎన్ఆర్ ల మీద, ఔట్ రేట్ ల మీద అమ్మడం తమ సెంటిమెంట్ అని బిజినెస్ చేసిన సంగతి కూడా తెలిసిందే. మొత్తం మీద ఇజమ్ చుట్టూ సెంటి మెంట్లు చక్కర్లు కొడుతున్నాయి.

Readmore!
Show comments

Related Stories :