ఫార్ములా రేస్ కోసం థమన్ పాట

దేని కైనా సరే, సంగీత దర్శకుడు థమన్ కవర్ సాంగ్ అన్నది ఓ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. తను ట్యూన్ చేసిన పాటలకు కవర్ వీడియోలు చేసి, వైరల్ చేయడం చేయడం థమన్ కు బాగా వచ్చు. ఇప్పుడు ఈ టాలెంట్ సినిమాలు దాటి ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. 

హైదరాబాద్ లో ప్రెస్టీజీయస్ గా జ‌రగబోతున్న పార్ములా ఈ రేస్ కోసం థమన్ ఓ కవర్ సాంగ్ తయారుచేస్తున్నారు. ఈ పాట కోసం థమన్ ప్రత్యేకంగా నృత్యం చేయబోతున్నారు.

గతంలో సినిమా పాటలకు థమన్ భలే డ్యాన్స్ లు చేసారు. ఈసారి ఇలాంటి ఓ ఈవెంట్ కు డ్యాన్స్ చేయబోతున్నారు. ఈ వీడియోలో పలువురు సెలబ్రిటీలు కనిపిస్తారని తెలుస్తోంది. కానీ ఎవరెవరు అన్నది ఇంకా క్లారిటీ లేదు. హీరో సాయి ధరమ్ తేజ్ పేరు అయితే ఒకటి బయటకు వచ్చింది. తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ కీలక నేత కేటిఆర్ కూడా వీడియోలో కనిపించే అవకాశం వుందంటున్నారు.

మొత్తానికి థమన్ పాపులారిటీ సినిమాలు దాటేసింది. ఇప్పుడు ఈ వీడియో సాంగ్ సక్సెస్ అయితే ఇంకెన్ని రంగాల్లో అడుగు పెడతారో మరి. Readmore!

Show comments

Related Stories :