ఆమె రొమాంటిక్ సీన్లను భర్త చూడలేదు!

యే దిల్ హే ముష్కిల్ సినిమాను ఇంత వరకూ చూడలేదట అభిషేక్. ఈ విషయం గురించి స్వయంగా అతడే చెప్పాడు! సెకెండ్ ఇన్నింగ్స్ లో ఐష్ యమ రొమాంటిక్ గా కనిపించిన ఈ సినిమా గురించి అభిషేక్ వద్ద మీడియా ప్రస్తావించగా… తను ఆ సినిమా చూడలేదని అభిషేక్ స్పష్టం చేశాడు. తను ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాను అని అందుకే చూడలేదని జూనియర్ బచ్చన్ చెప్పడం విశేషం.

తన కన్నా చిన్నవాడు అయిన రణ్ బీర్ తో ఐశ్వర్య రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడంపై బచ్చన్ల ఫ్యామిలీ అసంతృప్తికి గురి అయ్యిందనేది చాలా పాత విషయమే. దీనికి అనేక రుజువులను ప్రస్తావిస్తూ వచ్చింది మీడియా. ఇప్పటి వరకూ బచ్చన్లు ఎవరూ ఈ సినిమా గురించి మాటమాత్రమైనా స్పందించలేదు. మామూలుగా అయితే ఐష్ సినిమాలను అమితాబ్ , అబిషేక్ లు ప్రమోట్ చేసే వాళ్లు.  యే దిల్ హే ముష్కిల్  విషయంలో మాత్రం వాళ్లు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మీడియానే అభిషేక్ వద్ద ఈ సినిమా గురించి ప్రస్తావించింది. అయితే అభీ మాత్రం బిజీ.. అందుకే ఈ సినిమాను చూడలేదు అనేశాడు. మొత్తానికి ఐష్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో పూర్తిగా అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తోంది బచ్చన్ల ఫ్యామిలీ. ఎందుకో ఇలా..!

Show comments