పిక్ టాక్: పిగ్గీ చాప్స్‌.. చంపేసిందంతే.!

ఆస్కార్‌ వేడుకలో ప్రియాంకా చోప్రా కాస్ట్యూమ్స్‌ చూసి అంతా షాక్‌కి గురయ్యారు. 'ఇదేం క్రియేటివిటీ.?' అంటూ చాలామంది అసహనం వ్యక్తం చేశారు. ఈ కామెంట్లు ఇలా విన్పస్తుండగానే, ఇంకోపక్క, అదిరిపోయే డ్రెస్సింగ్‌తో, అందాల 'విందు' చేసేసింది ప్రియాంకా చోప్రా ఆస్కార్‌ పార్టీ ఈవెంట్‌లో. ఈ పార్టీ లుక్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. కిల్లింగ్ పిగ్గీ చాప్స్.. అంటూ అభిమానులు ఈ ఫొటోల్ని ఎడా పెడా సోషల్ మీడియాలో పరుగులెట్టించేస్తున్నారు.

అంతకుముందు అభిమానులు 'బేర్‌' మన్నది ఆస్కార్‌ అవార్డుల ఫంక్షన్‌ లుక్‌. అలా బేర్ మన్నవారికే షాకిచ్చింది ఈ హాట్ లుక్. ఇప్పుడీ కొత్త లుక్‌ చూసి అభిమానులే కాదు, ఎవరైనాసరే 'వావ్‌' అనాల్సిందే. అన్నట్టు, ఇలాంటి గ్లామరస్‌ లుక్‌ ప్రియాంకా చోప్రాకి కొత్తేమీ కాదనుకోండి.. అది వేరే విషయం. అయినాసరే, కొత్త లుక్‌కి ఇప్పుడు ఓ రేంజ్‌లో అప్లాజ్‌ వస్తోంది.

Show comments