అక్కినేని అఖిల్, 'ఆటాడుకుందాం రా' సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నాడు. అది కూడా టైటిల్ సాంగ్. చిన్నప్పుడెప్పుడో 'సిసింద్రీ' సినిమాలో నటించిన అఖిల్, ఆ సినిమాలోని 'ఆటాడుకుందాం రా..' అంటే పాటకి ఇప్పుడు మళ్ళీ స్టెప్పులు వేస్తున్నాడు. నెలల వయసులో అఖిల్ చేసిన సినిమా 'సిసింద్రీ'. అందులో నాగార్జున కీలకమైన పాత్రలో కనిపిస్తాడు. సినిమాలో నాగార్జున, టబు, పూజా బాత్రాలతో కలిసి పాటల్లో హల్‌చల్‌చేస్తాడు. అలాంటి పాటల్లో 'ఆటాడుకుందాం రా..' ఒకటి.
నెలల వయసున్నప్పుడు తాను నటించిన సినిమాలో పాటకి ఇప్పుడు డాన్స్ చేస్తుండడం చాలా ఆనందంగా వుందనీ, ఆ కారణంగానే తాను స్పెషల్ సాంగ్‌కి ఒప్పుకున్నాననీ అఖిల్ 'ఆన్ లొకేషన్' చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో నాగచైతన్య కూడా అతిథి పాత్రలో కనిపించనున్న విషయం విదితమే.
సుశాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జి. నాగేశ్వర్‌రెడ్డి దర్శకుడు. సోనమ్ బజ్వా, ఈ చిత్రంలో సుశాంత్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. మొత్తమ్మీద, అఖిల్ స్పెషల్ సాంగ్ 'ఆటాడుకుందాం రా' చిత్రానికి వెరీ వెరీ స్పెషల్ కానుంది. అయితే, హీరోగా తొలి చిత్రంతో ఫెయిల్యూర్ చవిచూసిన అఖిల్, రెండో సినిమాని పట్టాలెక్కించడంలో కిందా మీదా పడుతూ, గ్యాప్‌లో స్పెషల్ సాంగ్ చేయడమే అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.