'బేఫికర్' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్, తెలుగు ప్రేక్షకులకి 'ఆహా కళ్యాణం' అనే సినిమాతో సుపరిచితురాలే. నాని హీరోగా వచ్చిన సినిమా అది. తెలుగులో ఆ సినిమా బొక్క బోర్లా పడిందనుకోండి.. అది వేరే విషయం.
ఇక, 'బేఫికర్' సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్న వాణి కపూర్, ఈ సినిమాలో హీరో రణ్‌వీర్‌సింగ్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ గురించే చాలా చాలా ఎక్కువగా మాట్లాడేస్తోంది. షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ చెప్పమంటే, 'నా పక్కనే రణ్‌వీర్ సింగ్ వున్నాడు కదా.. చాలా రొమాంటిక్ గై.. చాలా కూల్‌గా వుంటాడు.. జోకులేస్తూ వుంటాడు.. ఆ కారణంగానే, సినిమాలో ఇద్దరి మధ్యా రొమాన్స్ చాలా నాచురల్‌గా పండింది..' అని చెప్పుకొచ్చింది.
సినిమాలో కెమెరా ముందు రొమాన్స్ విషయంలో ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారని ట్రైలర్‌ని చూస్తేనే అర్థమవుతుంది. సినిమా నిండా ఇద్దరి మధ్యా లిప్ టు లిప్ కిస్‌లతో నింపేశారు. చిత్రంగా, అవి రొమాంటిక్‌గా వుంటూనే.. ప్రేమ అనే అద్భుతమైన భావనను అతి గొప్పగా చెబుతాయి తప్ప, వల్గర్‌గా వుండవని అంటోంది వాణి కపూర్. రణ్‌వీర్‌తో రొమాన్స్ సింపుల్‌గా బే ఫికర్.. అంటూ ముక్తాయింపు ఇచ్చిందీ అందాల భామ.