పిక్‌ టాక్‌: కైరా దత్‌ 'డేట్‌ నైట్‌' విత్‌ బాలయ్య

'రేసుగుర్రం' సినిమాలో 'బూచాడే..' అంటూ అల్లు అర్జున్‌తో కలిసి ఆడిపాడిన బ్యూటీ గుర్తుందా.? ఆ బ్యూటీనే కైరా దత్‌. ప్రస్తుతం బాలకృష్ణతో 'పైసావసూల్‌' సినిమాలో నటిస్తోంది. ఆమె చేస్తోన్నది ఐటమ్‌ సాంగ్‌ మాత్రమేనని ప్రచారం జరుగుతున్నా, అంతకు మించి ఆమెకు సినిమాలో చాలా ప్రాధాన్యత వుందంటున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్‌. 

ఇక, అసలు విషయానికొస్తే, బాలకృష్ణ 'గోల్డెన్‌ హార్ట్‌' గురించి చెబుతూ కైరా దత్‌ ఈ ఫొటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. 'డేట్‌ నైట్‌ విత్‌ బాలయ్య..' అంటూ కైరా దత్‌ పోస్ట్‌ చేసిన ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఏ మ్యాన్‌ విత్‌ గోల్డెన్‌ హార్ట్‌..' అంటూ బాలయ్యని ఆకాశానికెత్తేసింది కైరా దత్‌. బాలయ్యతో డిన్నర్‌ చేస్తూ, ఇదిగో ఇలా కైరా దత్‌ ఫొటోకి పోజిచ్చేసింది. 

ఇక, రేపు (జులై 28) 'పైసా వసూల్‌' సినిమా స్టంపర్‌ రాబోతోంది. ఉదయం 10.12 నిమిషాలకి ఈ స్టంపర్‌ని విడుదల చేయనున్నారు. బాలకృష్ణ సరసన ఈ 'పైసావసూల్‌' సినిమాలో శ్రియ, ముస్కాన్‌ హీరోయిన్లుగా నటిస్తోన్న విషయం విదితమే.

Show comments