దాసరి సినీ విశేషాలు

రచయితగా సినిమారంగంలో ప్రవేశించి తాతమనవడు సినిమాతో సంచలనంగా ముందుకు దూసుకుపోయారు దర్శకుడు దాసరి నారాయణ రావు.

సినిమా రంగంలో పెద్దాయినగా ఎదిగిన ఆయన సాధించిన విశేషాలు ఎన్నో.

ఆ రోజుల్లోనే దేవుడే దిగివస్తే అనే సోషియో ఫాంటసీని తీసారు.

కమెడియన్ రాజబాబును ట్రాజెడీ హీరోగా ఎవరికి వారే యమునా తీరే సినిమా తీసారు.

అందరూ కొత్తవాళ్లతో స్వర్గం నరకం తీసారు.

తక్కువ టైమ్ లో,తక్కువ ఖర్చులో నీడ సినిమా తీసి చూపించారు.

చిల్లర కొట్టు చిట్టెమ్మ నాటకాన్ని, బలిఫీఠం లాంటి నవలను, దేవదాసు మళ్లీ పుట్టాడు లాంటి సీక్వెల్ ను తీయడం, అదీ ఆ రోజుల్లో దాసరి ఘనతే.

సినిమా వాళ్ల కథలతో శివరంజని,అద్దాల మేడ లాంటి సినిమాలు తీసారు.

నారాయణ మూర్తి హీరోగా ఒరే రిక్షా సినిమా తీసారు.

ఎన్టీఆర్, ఎఎన్నార్ పీక్ స్టేజ్ లో వున్న రోజుల్లో కూడా, దాసరి సెట్ లోకి వస్తున్నారు అంటే టక్కున లేచి నిల్చునేవారట.

చిత్రమైన టైటిళ్లు పెట్టడంలో దాసరిది అందె వేసిన చేయి. అమ్మ రాజీనామా,పెళ్లి మీకు అక్షింతలు మాకు, రాముడేరావణుడైతే, పెద్దిల్లు చిన్నిల్లు, ధర్మపీఠం దద్దరిల్లింది ఇలా చాలా టైటిళ్లు వున్నాయి.

తను నిర్మాతగా వుంటూ సహాయకులకు అవకాశంఇస్తూ సినిమాలు నిర్మించడం దాసరి ఆ రోజుల్లోనే చేసారు.

పోస్టర్ మీద మేఘాల్లో తన పేరు వేసుకోవడం, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, నిర్మాత, దర్శకత్వం ఇలా లెక్కకు మించిన శాఖలు ఒకేసారి హాండిల్ చేయడం దాసరి స్పెషాలిటీ.

Show comments