మెగాస్టారూ.. సిక్స్‌ ప్యాక్‌ అంత చులకనా.?

ఈ రోజుల్లో యంగ్‌ హీరోలకి సిక్స్‌ ప్యాక్‌ చాలా చిన్న విషయం. అదే సీనియర్‌ హీరోలకైతే నరకం. ఈ విషయాన్ని వయసు 40 దాటిన హీరోలే చెబుతారు. పైగా, సిక్స్‌ ప్యాక్‌ కోసం ట్రై చేసి, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని దాదాపుగా ప్రతి హీరో, అనుభవాన్నంతా రంగరించి చెప్పడం వింటూనే వున్నాం. కానీ, మెగాస్టార్‌ చిరంజీవి మాత్రం చాలా తేలిగ్గా, 'సిక్స్‌ ప్యాక్‌ చేసేయాలనుకుంటే, చేసేస్తా..' అంటున్నారు. 

సిక్స్‌ ప్యాక్‌ గురించిన ప్రశ్న రాగానే, మెగాస్టార్‌ చిరంజీవిలో ఏదో తెలియని ఉత్సాహమైతే కన్పిస్తోంది. అదే సమయంలో, అది అంత తేలిక కాదని ఆయనకీ తెలియకుండా వుంటుందా.? ఛాన్సే లేదు. అభిమానుల్ని ఉత్సాహపరిచేందుకు బహుశా, చిరంజీవి సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌ని చాలా తేలిగ్గా భావిస్తున్నట్టున్నారు. 

9 ఏళ్ళ విరామం తర్వాత చిరంజీవి హీరోగా నటించిన చిత్రం 'ఖైదీ నెంబర్‌ 150'. డాన్సుల్లో చిరంజీవి మునుపటి గ్రేస్‌ అయితే చూపించారుగానీ, అప్పట్లో వున్న వేగం ఆయనలో కొరవడింది. ఇంత గ్యాప్‌ తర్వాత చిరంజీవి ఆ స్థాయిలో చెయ్యడమే చాలా గొప్ప విషయమనుకోండి.. అది వేరే విషయం. 'ఖైదీ' కోసం చిరంజీవి తీసుకున్న టైమ్‌ చాలా ఎక్కువే. ఈ గ్యాప్‌లో శరీరాన్ని ఫిట్‌గా మార్చడానికే చిరంజీవి చాలా తంటాలు పడాల్సి వచ్చింది. 

సిక్స్‌ ప్యాక్‌ విషయానికొస్తే, అది చిరంజీవికి అంత తేలికైన వ్యవహారం కాదు. 'ఢమరుకం' సినిమా కోసం సిక్స్‌ ప్యాక్‌ లాంటిది ట్రై చేసిన నాగార్జున, అది సిక్స్‌ ప్యాక్‌ కానే కాదని తేల్చేశారు. ఏదో లైటింగ్‌ ఎఫెక్ట్‌ పెట్టి మేనేజ్‌ చేశాం.. అని నిజాయితీగా నాగ్‌ ఒప్పేసుకున్నాడాయన. సీనియర్‌ హీరోలలో నాగార్జున ఒక్కడే, వయసు మీద పడ్తున్నా ఫిజిక్‌ని పెర్‌ఫెక్ట్‌గా మెయిన్‌టెయిన్‌ చేస్తున్నాడు. సో, సీనియర్ల నుంచి సిక్స్‌ ప్యాక్‌ని ఎక్స్‌పెక్ట్‌ చేయలేం. చేసేయగలం.. అని ఎవరైనా చెప్పినా, అది జస్ట్‌ ఫ్యాన్స్‌లో జోష్‌ పెంచడానికేనని సరిపెట్టుకోవాలంతే. Readmore!

Show comments