కొత్త బ్లాక్ కాస్త కాస్ట్లీ గురూ?

పెద్ద నోట్ల రద్దుతో మొత్తం తల్లకిందులు అయిపోయింది. సినిమా ఇండస్ట్రీ చాలా రకాలుగా షేక్ అయింది. కానీ ఇప్పుడు కొత్త వార్తలు వినివస్తున్నాయి. తమ దగ్గర వుండిపోయిన పెద్ద నోట్లను ఇరవై నుంచి ముఫై శాతంతో వైట్ చేసుకున్నారు కొంతమంది అని వార్తలు ఇప్పటికే వినవచ్చాయి. మిగిలిన వారు కూడా అదే పనిలో వున్నారు.

ఏమయినా కూడా బ్లాక్ కు వైట్ సరిసమానంగా రావడం లేదు. పది నుంచి ముఫై శాతం లాస్ తప్పడం లేదు. అయితే ఇప్పుడు ఇమ్మీడియట్ ఆ లాస్ పూడ్చుకునే పనిలో వున్నారట . కొత్త నోట్లుగా మారిన బ్లాక్ మనీ వున్న జనాలు. దీనికి కీలకమైన రంగం సినిమా రంగమే. అందుకే అప్పుడే డీల్స్ కోసం చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఎంత వైట్ లో వ్యాపారం చేయాలన్నా, హీరోల దగ్గరకు వచ్చేసరికి కొంతయినా బ్లాక్ తప్పదు. అందుకే టాలీవుడ్ లో బ్లాక్ అవసరం ఎప్పుడూ వుంటుంది. సో అయిదు రూపాయిల వడ్డీకి బ్లాక్ రెడీ అంటూ ఫీలర్లు వదులుతున్నారట ఇండస్ట్రీలోకి. సాధారణంగా రెండు నుంచి మూడు రూపాయిలు వుంటుంది. ఎప్పుడో అత్యవసరం అయితే తప్ప అయిదుకు చేరదు. కానీ ఇప్పుడు లాస్ ను పూడ్చుకోవడానికి అయిదు నే ఫిక్స్ చేసేసారట.  ఇలాంటి ఫీలర్లు ఎక్కువగా విజయవాడ వైపు నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే ఇప్పటికిప్పుడు హెవీ వడ్డీలకు ఫైనాన్స్ తీసుకునే పరిస్థితి టాలీవుడ్ లోలేదు. ఎందుకంటే ఇప్పట్లో కరెన్సీ కష్టాలు తీరవు. అవి తీరితే కానీ, డైలీ ఖర్చులకు నోట్లు రావు. అదీ కాక, బిజినెస్ ట్రాన్సాక్షన్ లిమిట్ లు పెంచాల్సి వుంది. అసలు ప్రభుత్వం ఇంకా ఎన్ని పగ్గాలు బిగిస్తుందో పూర్తిగా తేలాల్సి వుంది. అవన్నీ క్లియర్ అయితేనే, కొత్త నిర్మాణాల ప్రారంభమవుతాయి. అంతవరకు రన్నింగ్ లో వున్నవి సాగుతాయి. సో అందువల్ల ఇప్పట్లో అర్జెంట్ గా బ్లాక ఫైనాన్స్ కోసం చూసేవాళ్లు టాలీవుడ్ లో తక్కువే.  Readmore!

Show comments