బాలయ్య కౌంటర్‌ ఎవరికి.?

'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా ట్రైలర్‌ విడుదల సందర్భంగా హీరో నందమూరి బాలకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'రెండు మూడేళ్ళు తీయాలనుకోలేదు.. కథని నమ్ముకున్నాం.. శరవేగంగా తీసేశాం.. చిన్న ప్రయత్నం కాదిది, చాలా చాలా పెద్ద ప్రయత్నం.. కథ అద్భుతంగా వచ్చింది, సినిమా ఇంకా అద్భుతంగా వచ్చింది..' అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమలో కలకలం బయల్దేరింది. 

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' సినిమా అత్యంత భారీతనంతో రూపొందిన విషయం విదితమే. సుదీర్ఘకాలం ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. అఫ్‌కోర్స్‌, ఆ స్థాయిలో తొలి పార్ట్‌ వసూళ్ళు సాధించిందనుకోండి.. అది వేరే విషయం. అయితే, ఇంతకాలం తీసింది ఇదా.? అని తొలి పార్ట్‌ చూశాక చాలామంది పెదవి విరిచారు. రెండు పార్టులుగా సినిమా తీయడంతో, తొలి పార్ట్‌లో 'కంటెంట్‌' తగ్గిందనే విమర్శల్ని ఎదుర్కొంది 'బాహుబలి'. 

బాలయ్య కౌంటర్‌ వేసింది 'బాహుబలి'కేనా.? అని టాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోందిప్పుడు. అయితే, రాజమౌళి మాత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాని ఎనిమిది నెలల్లో పూర్తి చేసిన దర్శకుడు క్రిష్‌కి అభినందనలు తెలిపాడు. ట్రైలర్‌ అద్భుతంగా వుందని కితాబులిచ్చాడు. ఇకనేం, బాలయ్య వ్యాఖ్యలు జనరల్‌గా చేసినవేనని సరిపెట్టుకోవాలంటున్నారు టాలీవుడ్‌లో చాలామంది.

Show comments