జక్కన్న కోసం వస్తున్న చిరు

కమెడియన్ కమ్ హీరో సునీల్ అంటే మెగాస్టార్ చిరంజీవికి కాస్త అభిమానం ఎక్కువే. అందుకే సునీల్ లేటెస్ట్ మూవీ జక్కన్న అడియో ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా రావడానికి అంగీకరించారు. జక్కన్న అడియో ఫంక్షన్ 24న శిల్పకళావేదికలో జరగనున్న సంగతి తెలిసిందే. చిరంజీవితో పాటు, ఆయన 150 వ సినిమా డైరక్టర్ వివి వినాయక్ కూడా హాజరవుతారట.

 ప్రేమకథాచిత్రమ్ నిర్మించిన సుదర్శన రెడ్డి జక్కన్న చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆకెళ్ల వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో సునీల్ చిత్రాల్లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ తో వుండే సినిమా ఇది అని తెలుస్తోంది. దాదాపు అందరు కమెడియన్లు వున్నారు ఈ సినిమాలో.

Show comments