'కత్తి' రీమేక్‌ని తెలుగులో పవన్‌తో చేద్దామనుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ని కాంటాక్ట్ చేసారు. మహేష్ పేరు కూడా ప్రస్తావనకి వచ్చింది కానీ ఎవరూ ఆసక్తి చూపించలేదు. తన రీఎంట్రీ కోసం కథల కోసం చూస్తోన్న చిరంజీవి 'కత్తి' చూసి తెలుగులో వర్కవుట్ అవుతుందని అనుకున్నారు కానీ బెటర్ స్టోరీస్ కోసం వెయిట్ చేసారు.
ఫైనల్‌గా దీనికంటే బెటర్ స్క్రిప్ట్ కనిపించకపోయే సరికి ఆయన దీనినే ఓకే చేసారు. చిరంజీవి కత్తి రీమేక్ చేస్తున్నారనే వార్తలు వచ్చినప్పుడు ఇది చాలా పెద్ద మిస్టేక్ అని చాలా మంది భావించారు. విజయ్ చేసిన కథకి చిరంజీవి సూట్ అవరని అనుకున్నారు. కానీ తనపై ఈ కథ ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందని చిరంజీవి నమ్మారు.
ఆ పాత్రకి అనుగుణంగా తనని తాను మలచుకున్నారు. కాజల్ పక్కన వయసు మళ్లిన వాడిలా ఉంటాడనే కామెంట్లని సీరియస్‌గా తీసుకుని తన బాడీ మీద శ్రద్ధ పెట్టారు. తన రీఎంట్రీకి, అదిప్పుడు చేస్తోన్న సంచలనాలకి కర్త, కర్మ, క్రియ మొత్తం తానే అయ్యారు. మాస్ పల్స్ తెలుసుకునే విషయంలో తనని మించిన వారు లేరని, కథ తెలియగానే తనని తాను తెరపై చూసుకోవడంలో కూడా చిరంజీవి జడ్జిమెంట్ బెస్ట్ అని చూపించారు. అందుకే ఇది పూర్తిగా చిరంజీవి విజయం. అరవై శాతం సక్సెస్ క్రెడిట్ ఆయనదే అయితే మిగతాది మిగిలిన వాళ్లంతా షేర్ చేసుకుంటారు.