బన్నీకి ఎందుకంత కోపం?

బన్నీ పగలబడి నవ్వుతున్న స్టిల్స్ బయటకు వచ్చాయి, డిజె, అలియాస్ దువ్వాడ జగన్నాధమ్ సినిమాకు సంబంధించి. కానీ అవి చూసి ఫుల్ ఫన్ మాత్రమే అనుకోకూడదట. సినిమాలో బన్నీ క్యారెక్టర్ కు రెండో షేడ్ కూడా వుందట. అది చాలా అగ్రెసివ్ గా వుంటుందట. ఎక్కడ చిన్న అన్యాయం జరిగినా సహించనిది. 

బన్నీ చైల్డ్ హుడ్ ఎపిసోడ్ నుంచే అది చూపిస్తారట సినిమాలో. అప్పటి నుంచి ఓ పోలీస్ ఆఫీసర్ కు సాయం చేస్తూ వుంటాడట. అంటే ఓ విధంగా పోలీస్ ఇన్ ఫార్మర్ కమ్ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ టైపు అన్నమాట. కానీ మామూలుగా మాత్రం అన్నపూర్ణ క్యాటరింగ్ సర్వీస్ నడుపుతుంటాడట. 

డిజె గురించి వినిపిస్తున్న ఈ గ్యాసిప్ లు వింటుంటే జంటిల్ మెన్ తో సహా చాలా సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. మరి ఎన్ని సినిమాలు మిక్సీలో వేసి రుబ్బేసారో కథకుడు, దర్శకుడు హరీష్ శంకర్.

 

Show comments