పెళ్లైన హీరోతో ఎఫైర్ రూమర్స్.. అమల మండిపాటు!

భర్త నుంచి విడిపోయిన అమలాపాల్ విషయంలో తమిళ మీడియా కొత్త రూమర్లను ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఈమెకూ.. నటుడు ధనుష్ కు మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అనేది ఆ రూమర్ల సారాంశం! అతడూ పెళ్లైన వ్యక్తే.. అది కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు భర్త! అలాంటి హీరోకి, అమలకు మధ్య ప్రేమాయణం నడుస్తోందని ప్రచారం మొదలైంది.

ఆమె వివాహానికి పూర్వం కూడా ధనుష్ సరసన నటించింది.  వివాహం, విడిపోవడం తర్వాత ఇప్పుడు ‘వీఐపీ-2’ లో   అమల ధనుష్ తో నటిస్తోంది. దీంతో రూమర్లు ఊపందుకున్నాయి. వీటికి ఊపునిచ్చిన అంశాలేమిటంటే.. అమల కెరీర్ ను కోలీవుడ్ లో దెబ్బతీయడానికి ఆమె భర్త కుటుంబం గట్టిగానే ప్రయత్నిస్తోందట. ఆమెకు అవకాశాలు ఇవ్వవద్దని ధనుష్ ను కూడా ఆ కుటుంబం కోరిందట. అయితే వారిని ధనుష్ లెక్క చేయలేదు. ఆమెకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు.

ఇలాంటి నేపథ్యంలో తమిళ మీడియాకు మేత దొరికింది. దీంతో అమలపాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తనకూ ధనుష్ కు ముడిపెడుతూ వచ్చిన వార్తలను ఖండిస్తూ.. ఆమె విరుచుకుపడింది. ఇలాంటి వదంతులు నీఛమైన చర్యలు అని అమల వ్యాఖ్యానించింది. ధనుష్ తన శ్రేయోభిలాషి అని, తన కాపురాన్ని నిలబెట్టడానికి కూడా ఆయన ప్రయత్నించాడని తెలిపింది. అలాంటి వ్యక్తి తో తనకు ముడిపెడుతూ ప్రచారం చేయడం బాధాకరమని వ్యాఖ్యానించింది. 

Show comments