ఈ వీక్‌ ట్రేడ్‌ టాక్‌

మజ్ను చిత్రానికి ఊహించిన దానికంటే మంచి ఓపెనింగ్స్‌ వచ్చాయి. నాని హీరోగా నటించిన సినిమాల్లో దీనికే ఎక్కువ ఓపెనింగ్‌ వచ్చిందని ట్రేడ్‌ సర్కిల్స్‌ అంటున్నాయి. వరుసగా మంచి కథలు ఎంచుకుంటోన్న నాని ఈసారి ఒక రొటీన్‌ ట్రయాంగిల్‌ రొమాన్స్‌ కథని ఎంచుకున్నాడు.

అయితే వినోదానికి ప్రాధాన్యమివ్వడంతో మజ్ను అందరితో మంచి మార్కులు వేయించుకున్నాడు. నానికి మరో సక్సెస్‌ఫుల్‌ సినిమాగా నిలిచిన మజ్ను ఓవర్సీస్‌లో కూడా మంచి వసూళ్లు తెచ్చుకుంది. రైల్‌ చిత్రానికి మొదటి రోజు వసూళ్లు బాగున్నాయి కానీ తర్వాత ట్రాక్‌ తప్పేసాయి. 

జనతా గ్యారేజ్‌ బిజినెస్‌ క్లోజ్‌ అయిపోయింది. శ్రీమంతుడు రికార్డులని కొడుతుందనే అభిమానుల ఆశలని ఈ చిత్రం తీర్చలేకపోయింది. ఈ వారంలో హైపర్‌, ధోని చిత్రాలు రిలీజయ్యాయి. ధోని చిత్రానికి ఓపెనింగ్స్‌ చూసి ట్రేడ్‌ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. 

Readmore!
Show comments