పిక్‌ టాక్‌: హాట్‌ హాట్‌ 'శర్మ' సిస్టర్స్‌

తెలుగులో తొలి చిత్రమే అత్యంత ప్రతిష్టాత్మకం.. కానీ, ఏం లాభం.? తొలి సినిమా తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదామెకి. అంతే, తెలుగులో రెండో సినిమా చేశాక, తెలుగు సినిమాలకి గుడ్‌ బై చెప్పేసింది.

బాలీవుడ్‌లో ఒకటీ అరా సినిమాలు చేసిన ఆ బ్యూటీ, అక్కడా పెద్దగా వర్కవుట్‌ కాకపోవడంతో డీలాపడింది. ఇంతకీ ఎవరా బ్యూటీ.? ఇంకెవరు, 'చిరుత' ఫేం నేహా శర్మ. అప్పట్లో చరణ్‌ - నేహ మధ్య ఏదో వుందంటూ గాసిప్స్‌ రావడం, అదంతా ఉత్తదేనని తేలడం తెల్సిన విషయాలే. 

ఇంతకీ, ఇప్పుడు నేహా శర్మ ఏం చేస్తోందట.? సినిమాల సంగతేమోగానీ, చెల్లెలితో కలిసి ఎంచక్కా జిమ్‌లో వర్కవుట్స్‌ చేసేస్తోంది. అందాల భామలు తమ అందాలకు మెరుగులు దిద్దుకోవడం, ఫిట్‌నెస్‌ కోసం సమయాన్ని కేటాయించడం మామూలే.

అయితే శర్మ సిస్టర్స్‌ ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివేశారు. వెరైటీ టెక్నిక్స్‌ ఫిట్‌నెస్‌లో కనిపెట్టడం, వాటిని చేసి చూపించడం అలవాటుగా పెట్టేసుకున్నారు. 

అటు నేహా శర్మ, ఇటు ఆమె చెల్లెలు ఐషా శర్మ.. ఇద్దరూ సోషల్‌ మీడియాలో జిమ్‌ వర్కవుట్స్‌ వీడియోల్ని ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేస్తూ, కావాల్సినంత హాట్‌ అప్పీల్‌ అయితే పంచుతున్నారు. ఫొటోలో చూస్తున్నారు కదా.. వర్కవుట్స్‌ తర్వాత నేహా శర్మ, ఐషా శర్మ హాట్‌ అండ్‌ స్పైసీ అవతార్‌.! ఇంతేనా, సినిమా అవకాశాల కోసం ట్రై చేసేదమన్నా వుందా.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే.

Show comments