కళాబంధు బుడగ పేలిపోయింది

మొత్తానికి మెగా సినిమా అంటూ కళాబంధు టి సుబ్బిరామి రెడ్డి అందించిన బుడగను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేల్చేసాడు. అసలు పవన్ పేల్చక ముందే జనం ఎవరూ ఆ ప్రకటనను నమ్మలేదు. అదో జోక్ ఆప్ ది ఇయర్ అనుకున్నారు.

మెగా బ్రదర్స్ ఏక్టింగ్, త్రివిక్రమ్ డైరక్షన్ అనగానే ఫిబ్రవరిలో ఏప్రియల్ ఫూల్ వార్త అనుకున్నారు. అలాగే జరిగింది. అలాంటి ప్రపోజల్ ఏదీ తన ముందుకు రాలేదని పవర్ స్టార్ అమెరికాలో జనాలకు చెప్పేసారు. అక్కడ అభిమానులు అడగడం తడువు, తడబడకుండా, మొహమాట పడకుండా చెప్పేసారు..'అలాంటిదేం లేదని'.

ఇంకేముంది కళాబంధు అందంగా ఊదిన మెగా బుడగ కాస్తా పేలిపోయినట్లే. అయినా అంత పెద్దాయిన, మరీ ఇలా భోళా స్టేట్ మెంట్ లు విడుదల చేయడం ఏమిటో? 

Readmore!
Show comments

Related Stories :