కమలనాథులూ.. రసికులే నండోయ్!

ఏం కాంగ్రెస్ వాళ్లేనా.. కమలం పార్టీ ఏం తక్కువ? నీతి, నిజాయితీ, విలువలు.. ఇవన్నీ పైకి చెప్పే కబుర్లు! చెప్పేవీ శ్రీరంగ నీతులు.. దూరేవీ..! అన్నట్టుగా ఉంది వీళ్ల పరిస్థితి. దూరడం లేదు.. డైరెక్టుగా రాజ్ భవన్ కే తెచ్చేసుకుంటున్నాడట మేఘాలయ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన మాజీ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ షణ్ముఖనాథన్!

రాజ్ భవన్ ను లేడీస్ క్లబ్ గా మార్చేశాడని, ఈయనకు అడుగడుగునా ఆడవాసన ఉండాల్సిందే అని.. రాజ్ భవన్ ఉద్యోగులు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి, మేఘాలయ ముఖ్యమంత్రికి లేఖలు రాశారంటే.. పరిస్థితి ఎలా ఉండిందో అర్థం చేసుకోవచ్చు!

ఈ మాజీ ఆర్ఎస్ ఎస్ ప్రచారక్ ను 2015 లో మేఘాలయ గవర్నర్ గా నియమించింది మోడీ సర్కారు. తమకు అనుకూలురు, తమ వాళ్లు ప్రతి రాష్ట్రానికీ గవర్నర్ గా ఉండాలనే సంకల్పంతో ఈయనను మేఘాలయకు గవర్నర్ ను చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన ఈ షణ్ముఖనాథన్ రాజ్ భవన్ తో తన కామకలాపాలను రక్తి కట్టించాడట!

అనుదినం రాజ్ భవన్ యువతులు వచ్చి పోతూ ఉంటారట! వాళ్లకు పర్మిషన్లు ఏమీ అవసరం లేదట.. డైరెక్టుగా బెడ్రూమ్ వరకూ వెళ్లిపోవచ్చు. గవర్నర్ కోసం ఇద్దరు యంగ్ లేడీ ఆఫీసర్స్, రాత్రి పూట ‘సేవలు’ అందించడానికి ఒక నర్స్, ఒక కుక్.. అది కూడా ఆడమనిషే ఉంటారట! గవర్నర్ సేవలకు ఉండిన.. పురుష అధికారులను ట్రాన్స్ పర్ చేయించి, వారి స్థానాల్లో ఆడవాళ్లను తెచ్చుకున్నాడట ఈ మహానుభావుడు! Readmore!

సినిమాల్లో చూపించే సెక్స్ వల్ మానియక్ లాగా ప్రవర్తిస్తున్న ఈయనను తట్టుకోలేక.. రాజ్ భవన్ ఉద్యోగులు.. ఏకంగా రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి, కేంద్ర హోం శాఖ మంత్రి.. అందరికీ ఫిర్యాదు చేశారు. ఒకరుకాకపోతే మరొకరు స్పందిస్తారని వారు ఆశించారు. ఈ ఒత్తిడితో ఎట్టకేలకూ షణ్ముఖనాథన్ రాజీనామా చేశాడు!

మొత్తానికి రాజ్ భవన్ ను అడ్డాగా మార్చుకుని శృంగార లీలలను సాగించడంలో కమలం పార్టీ మిత్రులు ఏమీ తక్కువ కాదని నిరూపణ అయ్యింది. ఇప్పటికే ఎన్డీ తివారీని కమలంలోకి చేర్చుకున్నారు. ఇప్పుడు మరో షణ్ముఖనాథన్ కూడా వీళ్లోడే! ఎందరో మహానుభావులు. ఒక్కొక్కరూ.. కమలం పార్టీ రెక్కలు విప్పి.. అసలు రూపాన్ని చూపిస్తున్నారు!

Show comments

Related Stories :