దాసరి ఆఖరి కథ అదే?

కథకుడిగా, మాటల రచయితగా దాసరి నారాయణ రావు సాధించిన విజయాలు ఎన్నో వున్నాయి. బాలకృష్ణతో సినిమా తరువాత ఆయన మళ్లీ మెగా ఫోన్ పట్టుకోలేదు. అందువల్ల దాసరి కథ ఏదీ బయటకు రాలేదు.

అయితే తన శిష్యుడు మోహన్ బాబు కొడుకు హీరో మంచు విష్ణు కోసం మాంచి లైన్ రెడీ చేసి చెప్పారట. మదర్ సెంటిమెంట్ తో కూడిన ఆ కథను దాసరి సలహా సూచనల మేరకు ఆ కథను మోహన్ బాబు డెవలప్ చేయించారంట. దానికి దాసరి ఓకె చేసారట.

ఇప్పుడు ఈకథను విష్ణు హీరోగా త్వరలో తెరకెక్కిస్తామని మోహన్ బాబే వెల్లడించారు. గురువు కథతో, శిష్యుడు నిర్మాతగా, విష్ణు సినిమా అన్నమాట. సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్ల కథలను తయారు చేయడంలో దాసరిది అందె వేసిన చేయి.

అందువల్ల ఆయన చెప్పిన లైన్ అంటే కచ్చితంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలాగే వుంటుందని అనుకోవాలి.

Show comments