టాప్ హీరో - ప్రేమమ్ కథలు

ఇలియానా డిసైజా..గోవా సుందరి. తెలుగులో కుర్రాకారునే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను తన హవర్ గ్లాస్ ఫిజిక్ తో ఓ ఊపు ఊపేసింది. ఆ తరువాత బాలీవుడ్ లో ఓ కాలు, ఇక్కడో కాలు పెట్టి, రకరకాల విన్యాసాలు చేసి, ప్లానింగ్ చెడగొట్టుకోవడంతో అవకాశాలు చెట్టెక్కేసాయి. 

అయితే అప్పట్లో మాంచి ఊపు మీద వున్న సమయంలో ఓ వారసత్వ హీరోతో చెట్టపట్టాలు వేసిందని, ఆ హీరోనే అమ్మడి చేత బట్టల దుకాణం ఓపెన్ చేయించాడని గుసగుసలు వినిపించాయి. అయితే ఆలస్యంగా బయటకు వచ్చి, వినిపిస్తోన్న మరో గుసగుస ఏమంటంటే, మరో వారసత్వ హీరో ఈ అమ్మడి మీద అప్పట్లోనే మోజు పడ్డాడట. పెళ్లి పెళ్లి అని ఇంట్లో వాళ్ల సతాయింపులు పడుతున్న సదరు హీరో ఈ అమ్మాయిని ఏకంగా పెళ్లే చేసుకోవాలని అనుకున్నట్లు తెలుస్తోంది. 

కానీ కట్టుబాట్లు, ఇతరత్రా వ్యవహారాలు కాస్త గట్టిగా వున్న ఆ ఫ్యామిలీ ఆ ప్రయత్నాన్ని, కాస్త గట్టి ప్రయత్నమే చేసి, ఆపగలిగినట్లు తెలుస్తోంది. చిత్రమేమిటంటే, మళ్లీ అదే హీరో మరోసారి మరో హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించడం, దాన్ని కూడా ఇంట్లోవాళ్లు వమ్ము చేయడం. ఆఖరికి సంప్రదాయబద్దంగా సంబంధాలు చూస్తున్నారు. త్వరలో పెళ్లి కూడా అవుతుంది. అయితే మొదటి రెండు కథలు ప్రేమమ్ సినిమాలో మాదరిగా బ్రేకప్ స్టోరీస్ మాత్రమే.

Readmore!
Show comments

Related Stories :