ప్రేమమ్ కు నాగ్ వాయిస్ ఓవర్

ప్రేమమ్ సినిమా క్లయిమాక్స్ లో నాగ్ చిన్న కామియో రోల్ లో, మధ్యలో వెంకీ ఓ చిన్న కామియో రోల్ లో కనిపిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే మరో లేటెస్ట్ సంగతి ఏమిటంటే, ప్రేమమ్ ప్రారంభం నుంచి చివరి వరకు అప్పుడు అప్పుడు నాగ్ వాయిస్ ఓవర్ వుంటుందన్నది. 

సినిమా ప్రారంభమే నాగ్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది. ట్రయిలర్ లో నాగ చైతన్య చెప్పిన తొలి డైలాగ్ సినిమాలో నాగ్ వాయిస్ ఓవర్ లో వినిపిస్తుంది. ఆ తరువాత అక్కడక్కడ బిట్లు బిట్లుగా నాగ్ గొంతు వినిపిస్తుంది.  మొత్తానికి ప్రేమమ్ సినిమాకు నాగ్ తన వంతు ఎంత చేయాలో అంతా చేస్తున్నాడన్నమాట.

Show comments