పరశురామ్ తో విజయ్

భలే భలే మగాడివోయ్ లాంటి హిట్ సినిమాను అందించిన గీతా2 పతాకంపై మరో మాంచి సినిమా షూట్ త్వరలో ప్రారంభం కాబోతోంది. బన్నీ వాసు నిర్మాతగా, సోలో, శ్రీరస్తు శుభమస్తు వంటి హిట్ ఇచ్చిన డైరక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో మరో సినిమా ప్లాన్ చేసారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తారు. మిగిలిన స్టార్ కాస్ట్ వివరాలు తెలియాల్సి వుంది. గీతాలో విజయ్ దేవరకొండ రెండు సినిమాలు చేస్తారు. ఒకటి గీతా పతాకంపై రెండవది యువి అండ్ అదర్స్ కాంబినేషన్ లో. పెళ్లి చూపులు తరువాత విజయ్ దేవర కొండ సుమారు ఆరేడు సినిమాలు సైన్ చేసారు. వాటిలో ఇవి రెండు.

 

Readmore!
Show comments

Related Stories :