బాబు పాలనలో అత్యంత అసంతృప్తుడు బాబే!

నిన్నేమో ఏపీ ముఖ్యమంత్రి చేశాడని ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యను ప్రచారంలోకి తీసుకొచ్చింది తెలుగుదేశం అనుకూల మీడియా. తమ సర్వేలో తన పాలనపై 80 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నట్టుగా తేలిందని బాబు మంత్రులతో  వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఒక టెలీ కాన్ఫరెన్స్ లో బాబు మరో విషయాన్ని సెలవిచ్చారు. అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేస్తున్నా, వారి సంక్షేమం కోసం ఎంతగా కృషి చేస్తున్నా.. ప్రజలు సంతృప్తి పడలేదని బాబు వ్యాఖ్యానించారు! అంతే కాదు.. ప్రతి పక్షాల విష ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉందని కూడా బాబు అన్నారు.

చేసింది చెప్పుకోలేకపోతున్నాం… సరిగా ప్రచారం చేసుకోలేకపోతున్నామని బాబు ఆందోళన, అసంతృప్తి వ్యక్తం చేశారు! మరి ప్రచార పులి.. ఇలాంటి ఆందోళన వ్యక్తం చేయడం నిజంగా ఆసక్తికరమైన అంశమే. పని తక్కువ ప్రచారం ఎక్కువ అయిపోయిందని జనాలు అనుకొంటుంటే.. బాబు మాత్రం ఇప్పటి వరకూ జరుగుతున్న ప్రచారం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు! చేసింది చెప్పుకోలేకపోతున్నామని బాబు అసహన భరితులయ్యారు.

ఒకవైపు మెజారిటీ మీడియా వర్గం చంద్రబాబుకు అనుకూలంగా నిలబడుతోంది. యాక్టివ్ గా ఉన్న 14 న్యూస్ ఛానళ్లలో ఒకటి తప్ప అన్నీ చంద్రబాబుకు జై కొడుతున్నాయి, ఆ ఒక్క ఛానల్ ప్రసారాలను కూడా ఎప్పుడు అవసరమనిపిస్తే అప్పుడు ఆపించేస్తున్నారు. ఇక అనుకూల పత్రికల విన్యాసాలు సరేసరి! బాబు.. అనే మాటరాయల్సి వస్తే చాలు.. అవి బట్టలిప్పుకుని డాన్సులు చేస్తున్నాయి.

ఇదిగాక.. కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం తరపున చేస్తున్న ప్రచారం సరేసరి. మరి ఇంత అనుకూలంగా ఉన్నా.. బాబు సరిగా చెప్పుకోలేకపోతున్నామని అని ఆందోళన వ్యక్తం చేయడం ఆయన మానసిక అసంతృప్తిని చాటుతున్నట్టుగా ఉంది. అన్నీ అనుకూలంగా ఉంటేనే బాబు ఇంత అసహనభరితుడవుతున్నాడంటే.. వైఎస్ , జగన్ ల మీద విషం చిమ్మినట్టుగా మీడియా మొత్తం బాబుపై  రాతలు రాయడం మాట అటుంచి, కనీసం ఈ అనుకూల భజన చేయడాన్ని ఆపితే అప్పుడు బాబు పరిస్థితి ఏమిటో!

Show comments