ఒప్పందం చదవకుండా సంతకం చేసా

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను కృష్ణాజిల్లాకు నాలుగున్నర కోట్లకు కొనుగోలు చేసినపుడు ఈరోస్ సంస్థకు తనకు కుదిరిన ఒప్పందంపై నమ్మకంతో సంతకం చేసానని, అందులో వున్న క్లాజ్ లు చూసుకోలేదని అన్నారు బయ్యర్ సంపత్. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కారణంగా తాను రెండుకోట్లు నష్టపోయానని, తనను ఆదుకోవాలని కోరుతూ ఆయన ఫిలింనగర్ లో నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనతో గ్రేట్ ఆంధ్ర మాట్లాడడం జరిగింది. ఆ విశేషాలు.

*నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ కింద కొన్నాను.  అన్ని భారీ సినిమాలు ఇలాగే వ్యాపారం జరుగుతుంది. ఇది కామన్.

*ఈ సినిమాను మీ స్వంత పూచీపై కొంటున్నాం అని, లావాదేవీలకు, వివాదాలకు తావులేదని అగ్రిమెంట్ లో వున్న విషయం చూసుకోలేదు.  అగ్రిమెంట్ లో చాలా వున్నాయి. కానీ నేను చూసుకోకుండా సంతకం చేసేసాను. సాధారణంగా సినిమా వ్యాపారాలు సంతకాలతో కాకుండా నమ్మకాలతో జరుగుతాయి.

*పైగా అసలు నేను మాటలు జరిపింది నార్త్ స్టార్ సంస్థతో. అగ్రిమెంట్ చేసుకున్నది ఈరోస్ తో. అదే అడిగితే ఫరావాలేదు మేంవున్నాం అన్నారు శరద్ మరార్, శ్రీనివాస్ గారు. కానీ ఈరోస్ వాళ్లు దాంట్లో సవాలక్ష క్లాజ్ లు పెట్టారు. అవి వుంటాయని మేం ఊహించలేదు.

*ఒప్పందం కన్నా కొన్ని లక్షలు తక్కువ కట్టింది వాస్తవం. ఈ సినిమా తరువాత మరే సినిమా కొనలేదు. పంపిణచేయలేదు.

*నష్టం వచ్చిన విషయం తెలియచేసా. వాళ్లు ఈ సినిమా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వలేదుఅంటున్నారు.

*లీగల్ గా పోరాడే అవకాశం లేదు. ఈరోస్ వాళ్లు చాలా జాగ్రత్తగా సవాలక్ష క్లాజ్ లు పెట్టారు.

*అందుకే మొరాలిటీతో ఆదుకోమని కోరుతున్నాను.

*శరత్ మరార్ అంటే పవన్ సన్నిహితుడు. స్నేహం. అందుకే పవన్ ను అడుగుతున్నాం.

*పవన్ ను కలవాలని ప్రయత్నించాం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. వీళ్లు మామీద ఏదైనా చెప్పి వుండాలి. లేదా తెలియకపోయి వుండాలి. తెలిసినా స్పందించడం లేదంటే మరెందుకో అర్థం కావడంలేదు.

*పవన్ దిగివచ్చేవరకు పోరాటం సాగిస్తా. దిగివస్తారు. ఎందుకంటే నాయకుడు కదా? దిగిరాకపోతే ఎలా?

Show comments