ఈ మధ్యనే వర్మ వోడ్కా మానేసినట్లు ప్రకటించాడు. కానీ, చిరంజీవిని, మెగా ఫ్యామిలీని క్షమాపణ కోరుతూ వర్మ ట్వీటేశాడంటే.. కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది. అసలు మేటరేంటి.? ఏమోగానీ, 'చిరంజీవి లాంటి అన్నయ్య నాకుంటే..' అంటూ మొదలెట్టాడు వర్మ 'మెగా' భజన ట్విట్టర్‌లో. 'నాగబాబుగారు మాటలతో వదిలేశారు..' అని కూడా సెలవిచ్చాడు.
ఇక్కడ, వర్మ ఉద్దేశ్యం, 'నాగబాబు మాటలతో వదిలేశారు.. అదే చిరంజీవి లాంటి అన్నయ్య నాకుంటే నేను మాట్లాడిన మాటలకు నన్ను కొట్టేవారు' అని అనుకోవాలేమో. కానీ, ఇక్కడ వర్మ 'నేను మాట్లాడిన మాటలకి కొట్టేవాడిని..' అంటూ వర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఇది భాషా దోషం అనుకోవాలా.? లేదంటే, వర్మ ఎవర్నన్నా కొట్టాలని అనుకుంటున్నాడా.? ఏమో మరి, ఆయనకే తెలియాలి.
'ఇల్లిటరేట్స్..' అంటూ చదువురానోళ్ళ గురించి వర్మ సోషల్ మీడియాలో చాలా ఎటకారాలు చేసేస్తుంటారు. మరి, వర్మ నుంచే ఇలాంటి తప్పిదాలు ఏంటట.? ఓహో, ఇదంతా తెంగ్లీష్ వ్యవహారం కదా.. బహుశా, ఈ ట్వీట్లు వర్మ చేసి వుండడు. షరామామూలుగానే, వర్మ అకౌంట్ హ్యాక్ అయి వుండాలి. ఆ హ్యాక్ చేసిన 'వోడ్కా'బాబు ఎవరట.?