బాలయ్య సరసన హీరోయిన్ గా ముస్కాన్

పూరిజగన్నాధ్ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు బాలకృష్ణ. ఈ సినిమాకు ముగ్గురు భామల్ని హీరోయిన్లుగా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో ఓ ముద్దుగుమ్మను ఫైనలైజ్ చేశారని, ఆమెతో అగ్రిమెంట్ కూడా పూర్తయిందని ఈమధ్య వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఆ అమ్మాయి ఎవరో తెలిసింది. బాలయ్య సరసన హీరోయిన్ గా నటించనున్న ఆ బ్యూటీ పేరు ముస్కాన్.
 
దర్శకుడు పూరిజగన్నాధ్ ఈ పేరును అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు. అయితే అంతకుమించి డీటెయిల్స్ మాత్రం వెల్లడించలేదు. ఈ ముస్కాన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నాడు. ఈ ఎలిమెంట్ తో పాటు బాలయ్య సినిమా స్టోరీలైన్ కూడా వెల్లడించాడు పూరి. సినిమాలో బాలయ్య గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడని... నూటికి నూరు పాళ్లు తన మార్క్ హీరోయిజం ఉంటుందని వెల్లడించాడు.
 
ఈమధ్య కాలంలో బాలయ్య సినిమాల్లో పొలిటికల్ డైలాగ్స్, పంచ్ లు కనిపిస్తున్నాయి. అలాంటి పంచ్ లు మాత్రం తన సినిమాలో ఉండవని, కేవలం తన మార్క్ డైలాగ్స్, పంచ్ లు మాత్రమే ఉంటాయని పూరీ క్లారిటీ ఇచ్చాడు.

Show comments