సైన్యాన్ని అమరవీరుడి భార్య అడుగుతున్న చిరుకోరిక

‘’ నా భర్త మీ సహచరుడే.. మీలాగే ప్రాణాలకు తెగించి పోరాడాడు. దేశం  కోసం ప్రాణాలే విడిచాడు. ఆ దుఃఖం నుంచి కోలుకోవడం ఈ జీవితానికి జరిగే పని కాదు, కానీ ఉగ్రవాద మూకల పీఛమణుస్తున్న చర్యలు మాత్రం ఊరటనిస్తున్నాయి. నాలాంటి మరికొంతమంది సైనికుల భార్యలు ప్రాణాల పసుపు కుంకుమలకు ప్రమాదం రానీయకుండా చేస్తాయి మీ చర్యలు.  ఇలాంటి చర్యలు ఇంతకు ముందే చేపట్టి ఉంటే.. ఎంతో ప్రాణ నష్టం తప్పేది. ఇప్పటికైనా చేపట్టడం అనందకరం. వీర మరణం పొందిన మీ సహచరులకు ఆత్మతృప్తిని ఇస్తుంది  ఈ చర్య. అయితే.. మొదలుపెట్టిన వాళ్లు ఆపకూడదు. కనీసం ఆ ఒక్కడినీ చంపండి.. అదొక్కటీ జరిగితే ఈ సర్జికల్ స్ట్రైక్స్ అసలు లక్ష్యం నెరవేరినట్టే… ఆ రాక్షసుడిని చంపాలి. వాడెవరో కాదు.. హఫీజ్ సయీద్. 

లష్కరే తోయిబా అధినేత.. ఇంకా చెప్పాలంటే, భారత్ పై జరుగుతున్న సగం ఉగ్రవాద దాష్టికాలకు మూలం వాడే. ముంబై మారణ హోమానికి అయినా, సరిహద్దుల్లో జరుగుతున్న ముష్కర దాడులకైనా, కాశ్మీర్ లో విలయానికి అయినా.. సూత్రధారి వాడే.

సరిహద్దు దాటిన వారు వాడిని హతమార్చండి. ఈ ఉగ్రవాద మూకలకు అంతకు మించిన  చావు దెబ్బ ఉండదు. ఆ పని చేసి పెట్టండి, మీ సహచరుడి భార్యగా నేను కోరుతున్నది అదే..’’ 

అంటున్నారు అమరవీరుడు హవాల్దార్ అశోక్ కుమార్ సింగ్ భార్య. ఊడీ సంఘటనలో వీర మరణం పొందాడు అశోక్ కుమార్ సింగ్. పర్యవసనంగా జరుగుతున్న సర్జికల్ స్ట్రైక్స్ పట్ల ఆయన భార్య సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె హఫీజ్ సయీద్ పేరును ప్రస్తావించడం ఆమెకున్న గొప్ప అవగాహనకు నిదర్శనం.

ఎంతైనా సైనికుడి భార్య కదా.. శత్రువుల గురించి, ఉగ్రవాదం మూలాల గురించి అవగాహన ఉంటుంది. గమనించ దగ్గ అంశం ఏమిటంటే.. సర్జికల్ స్ట్రైక్స్ పట్ల చాలా మంది స్పందించారు. రాజకీయ పార్టీల అధినేతలు, మంత్రులు, వీర దేశ భక్తులు.. మీడియా.. అంతా స్పందించారు. కానీ ఒక లక్ష్యాన్ని ఎంచుకోండి.. ఈ ఎపిసోడ్ పాక్ కు చిరకాలపు కలవరపాటుగా మిగలాలి. ఉగ్రవాదులనే కాదు, వారికి ట్రైనింగ్ ఇచ్చేవాడిని మట్టు బెట్టండి. దేశానికి కొంచెం విరామం లభిస్తుంది… అనే సూచన చేసింది ఆ మహిళామణి. కరాచీలో దాక్కొన్నాడా, లాహోర్ లో నక్కాడా.. అనేది తర్వాతి సమస్య. లక్ష్యంగా చేసుకుంటే దొరకకుండా పోడు. భారత ప్రభుత్వం ఈ వీర పత్ని కోరిక తీరుస్తుందని.. తద్వారా ఆమె వీరులందరికీ సిసలైన నివాళి ఘటిస్తుందని ఆశిద్దాం. 

Show comments