కేసీఆర్ మరీ ఇంత చాదస్తమా?

రానురాను రాజుగుర్రం గాడిదయింది అన్నట్లు వుంది వ్యవహారం.  తెలంగాణ ఏర్పడితే అది బంగారు తెలంగాణ అవుతుంది అని ఆశపడ్డారు.  సరే, వచ్చింది. కేసిఆర్ సిఎమ్ అయ్యారు. ఇలా సీఎం అయ్యారో  లేదో జ్యోతిష్కులు, వాస్తు పండితులు చెప్పారు... సచివాలయానికి వాస్తు బాగాలేదని అన్నారు. వెంటనే దానిని కూల్చివేసి వాస్తుప్రకారం కడతానని ఓ సారి, లేదు ఏకంగా ఎర్రగడ్డ ఆసుపత్రి వున్న ప్రాంతానికే తరలిస్తానని మరోసారి చెప్పారు. 

జనంతో పాటు విపక్షాలు గగ్గోలు పెట్టేసరికి ఏవో కొన్ని సవరణలు చేసి వాస్తుదోషం పోయిందన్నారు. అయినా అనుమానం తీరక సచివాలయానికి రాకుండానే పాలన సాగిస్తున్నారు. తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే యాగం చేయాలని జ్యోతిష్కులు చెప్పారు అంటూ ఓ పెద్ద యాగం చేశారు. ఇలా ప్రతిది జ్యోతిష్కులను సంప్రదించి వారు చెప్పినట్టుగా చేసుకుంటూ పోతున్నారు కేసీఆర్. 

తాజాగా మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా జ్యోతిష్కుల మాటే వేదం అయిపోయినట్లు కనిపిస్తోంది. రాశి ప్రకారం మొక్కలు నాటాలని, ఏ రాశివారు ఏది నాటాలో జ్యోతిష్కులు జాబితా ఇచ్చారని, ఏరాశి వారు ఆ రాశికి చెందిన మొక్కలు నాటాలని అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో సాధారణ జనమే కాదు, మేధావులు, అధికారులు కూడా అవాక్కయ్యారు. కేసిఆర్ కు మరీ ఇంత చాదస్తం పట్టుకుందేమిటా? అని. 

ఇప్పుడు ఫలానా రాశివారు అదే రాశి మొక్కలు నాటాలని సీఎం హోదాలో ఆదేశిస్తే... ఎలాంటి రాశులు లేని జనం, నేతలు, అధికారులు ఏం చేయాలి. ఈ కార్యక్రమంలో పాల్గొనవద్దా, అలాంటి వారిలో  ఇతర మతాల వారుంటారు. అంటే వారిని ప్రభుత్వ కార్యక్రమాల నుంచి తప్పించినట్టు కాదా. అలా కాకుండా వారి పుట్టిన తేదీలు, సమయాలు తీసుకుని పంచాంగ కర్తల వద్దకు వెళ్లి వారి రాశి, నక్షత్రం ఏదో కనుక్కొని ఆ ప్రకారము విధుల్లో చేరి హరితాహారంలో పాల్గొనమని చెప్పినట్టా.  Readmore!

ఇందులో ఏదైనా ధర్మసమ్మతమూ కాదు, చట్ట బద్ధమూ కాదు. ముఖ్యమంత్రి ఇలా ప్రతి దానిని జ్యోతిష్కులు చెప్పారు, చేయండి అంటూ పాలన సాగించడం ఏమిటో..కోంపదీసి వారాలు, వర్జ్యాలు, రాహుకాలం, దుర్ముహుర్తం  చూసి ఫైళ్లమీద సంతకాలు చేస్తున్నారా ఏమిటి? పరిస్థితి ఏంటి. మంత్రుల జాతక చక్రాలు తెప్పించుకుని, చూసి మరీ పదవులు ఇచ్చారా ఏమిటి కొంపదీసి.. మొత్తానికి కేసిఆర్ కు వయస్సు వస్తున్నకొద్దీ నమ్మకాల మీద నమ్మకం పెరుగుతున్నట్లుంది? 

Show comments

Related Stories :