అవార్డుపై గౌరవం పెరిగింది: త్రివిక్రమ్‌

కళాతపస్వి కె.విశ్వనాథ్‌కి దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం దక్కడంతో అవార్డులపై నమ్మకం, గౌరవం పెరిగాయన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. స్నేహితుడు పవన్‌కళ్యాణ్‌తో కలిసి, విశ్వనాథ్‌ వద్దకు వెళ్ళిన త్రివిక్రమ్‌, విశ్వనాథ్‌గారి గురించి మాట్లాడే అనుభవం, స్థాయి తమకు లేదని, కేవలం గౌరవంతోనే ఆయన్ని అభినందించడానికి వచ్చామని చెప్పుకొచ్చారు. 

విశ్వనాథ్‌గారి మీద గౌరవంతో, ఆయన రూపొందించిన చిత్రాల్లోన్ని 12 చిత్రాల్ని ఎంపిక చేసి, వాటిని ఓ డిస్క్‌లా రూపొందించాలనే ఆలోచనను స్నేహితుడు పవన్‌కళ్యాణ్‌ తన దృష్టికి తీసుకొచ్చారనీ, ఈ ఏడాదిలోనే దాన్ని అందుబాటులోకి తీసుకొస్తామనీ, ఈ క్రమంలో ఆయా సినిమాలకు సంబంధించిన రైట్స్‌ కోసం అందర్నీ కలుస్తామని చెప్పారు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. 

మరోపక్క, అన్నయ్య చిరంజీవితో విశ్వనాథ్‌గారు స్వయంకృషి సినిమా తెరకెక్కిస్తున్నప్పుడు సెట్స్‌కి వెళ్ళేవాడిననీ, ఆయన సినిమాల్లో స్వాతిముత్యం తనకు బాగా నచ్చిన చిత్రమని అన్నారు పవన్‌కళ్యాణ్‌. విశ్వనాథ్‌ దర్శకత్వంలో 'శుభలేఖ', 'స్వయంకృషి', 'ఆపద్బాంధవుడు' చిత్రాల్లో నటించిన, నిన్ననే విశ్వనాథ్‌ని కలిసి అభినందనలు తెలిపిన విషయం విదితమే.

Readmore!
Show comments