ఈ సినిమా 'వర' మిచ్చేనా?

వర ముళ్లపూడి..ప్రఖ్యాత రచయిత, నిర్మాత ముళ్లపూడి వెంకటరమణ కుమారుడు. సినిమా మీద కమాండ్ వుంది..ప్రపంచ సినిమా మీద అవగాహన వుంది. కానీ ఏం లాభం? సరైన ట్రాక్ లో పడలేకపోయాడు. రాజమౌళి, ఎన్టీఆర్, కీరవాణి, రాఘవేంద్రరావు లాంటి వాళ్లందరికీ ఇతగాడంటే అభిమానం..కానీ ఏం సుఖం. ఎన్టీఆర్ లాంటి హీరోతో నా అల్లుడు అంటూసినిమా చేసాడు.కానీ హిట్ కొట్టలేకపోయాడు. ఆ తరువాత టీవీల్లో సీరియల్స్ చేసుకుంటే, అక్కడ బాగానే విజయాలు చవిచూసాడు. 

మళ్లీ ఇన్నాళ్లకు తనంటే అభిమానించే అందరి సహకారంతో, కుందనపు బొమ్మ అనే చిన్న సినిమా చేసాడు. సినిమా చిన్నదైనా సమర్పణ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. సంగీతం కీరవాణి. పల్లెటూరి నేపథ్యంలో ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది. ఈ సినిమాతో అయినా మళ్లీ కెరీర్ ట్రాక్ మీదకు వస్తుందని ఆశిస్తున్నాడు వర ముళ్లపూడి. ఆయనకు కుందనపు బొమ్మ ఆ వరం ఇస్తుందో? లేదో?

 

Readmore!
Show comments

Related Stories :