నయన.. విరహ వేదన అనుభవించడానికే నిర్ణయం!

తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయనతార అనుబంధం గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. వీరిద్దరూ వివిధ సందర్భాల్లో దిగిన సెల్ఫీలే వీరి మధ్య అనుబంధానికి అద్దం పడుతున్నాయి. వివిధ సందర్భాల్లో వీళ్లు సెల్ఫీలు దిగి తమ  ప్రేమాయణానికి సంబంధించిన ప్రచారానికి ఇంధనమిస్తున్నారు.

ఇటీవల ఓనమ్ పండగ సందర్భంగా వీళ్లిద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకుని, దిగిన ఫొటోలు.. వీరి అనుబంధం కొనసాగుతుందనే అభిప్రాయాన్ని బలపరిచాయి.

మరి సెలబ్రేషన్స్ ను ఇలా ఆ దర్శకుడితో కలిసి చేసుకుంటున్న నయన.. తమ ప్రేమయాణం గురించి జరుగుతున్న ప్రచారాన్ని తగ్గించడానికి కొత్త నిర్ణయం తీసుకుందట. అదేమనగా.. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా నుంచి తప్పుకోవడం! అతడిని దర్శకుడిగా నిలదొక్కుకునేలా చేయడానికి చాలానే కష్టపడుతున్న నయన.. సూర్యతో ఒక సినిమా చేసేలా మధ్యవర్తిత్వం చేసింది.

ఆ టాప్ హీరోతో సినిమా చేస్తే.. తన ప్రియుడికి సౌతిండియా మొత్తం గుర్తింపు వస్తుందనే భావనతో, తన పరపతిని ఉపయోగించుకుని మరీ సూర్యతో ఆ సినిమాకు ఓకే చెప్పిందట  నయన. అలా అంతా కుదిరికా.. ఆ సినిమా నుంచి నయన తప్పుకుంది!

మొదట ప్రియుడి దర్శకత్వంలో వచ్చే ఈ సినిమాలో నయనే హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాని, ఇప్పుడు మాత్రం ఆమె తప్పుకుంది. అదేమంటే.. అతడి దర్శకత్వంలో నటిస్తుంటే, తమ ప్రేమయాణం గురించి ప్రచారం మరీ ఎక్కువ అవుతుందనేది నయన భావనట!

పాపం.. జనాలు మాట్లాడుకుంటారేమో అనే భయంతో ఏకంగా విరహవేదనకే సిద్ధం అయినట్టుంది.

Show comments