బన్నీ శ్రమ ఫలిస్తుందా?

ఒకటి కాదు, రెండు కాదు, రెండు వారాలకు పైగానే బన్నీ శ్రమ పడ్డాడట. దేని కోసం. తమ్ముడు శిరీష్ సినిమా బాగా రావాలని. ఇక అరవింద్ అయితే చెప్పనక్కరలేదు. యాభై శాతం వరకు స్క్రిప్ట్ దశలోనే మార్పులు చేర్పులు చేయించారు. పాతిక శాతం వరకు రీషూట్ చేయించారు. ఇలా అంటే వాళ్లు అంగీకరించరు అనుకోండి.

అరవింద్ ఓ తండ్రిగా ఇన్ వాల్వ్ కావడం ఓకె. తొలిసారి బన్నీ కూడా తమ్ముడి సినిమా కోసం ఎక్స్ పెర్టైజ్ ఉపయోగించాడు. లోకేషన్లు, గెటప్ లు,  ఇలాంటివి అన్నీ ఆయన సలహా సూచనల మేరకే అని వినికిడి. ఏమయితే ఇవన్నీ కలిసి శ్రీరస్తు శుభమస్తు ట్రయిలర్ వరకు పాజిటివ్ టాక్ ను తీసుకువచ్చాయి. ఇక మిగిలింది సినిమా. 

హీరో శిరీష్ కు మాత్రమే కాదు, దర్శకుడు పరుశురామ్ కు లైఫ్ అండ్ డెత్ సమస్య. సారొచ్చారా తరువాత నిట్టనిలువునా పడిపోయిన గ్రాఫ్ ను తిరిగి పైకి లేపే ప్రయత్నం. ఈ ప్రయత్నంలో సక్సెస్ అయితేనే పరుశురామ్ ముందుకు వెళ్లగలిగేది. అందువల్ల శిరీష్ కన్నా పరుశురామ్ కే ఈ సినిమా కీలకం. ఇది విజయం అయితే ఇకపై శిరీష్ సినిమాలకు తెరవెనుక బన్నీ పర్యవేక్షణ పెరిగినా పెరగొచ్చు.

Show comments