ఉంగరాల రాంబాబు..సునీల్

సంబరాల రాంబాబు..ఎవరూ మరిచిపోలేని కామెడీ సినిమా..హీరో చలం. మళ్లీ అలాంటి కామెడీ హీరో సునీల్. సునీల్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నారు. ఒకటి జక్కన్న, రెండవది వీడు గోల్డెహె. ముచ్చటగా మూడో సినిమాకు మాత్రం ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. ఈ సినిమాకు మాంచి టైటిల్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే ఉంగరాల రాంబాబు.

ఈ సినిమాలో హీరోకి రంగురాళ్ల ఉంగరాలు వేళ్లకు ధరించే అలవాటు వుంటుందట. అందుకే ఈ టైటిల్ అయితే సూపర్ ఏప్ట్ గా వుంటుదని హీరో, దర్శకుడు, నిర్మాత ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. టైటిల్ మాత్రం అదిరిపోయింది..సర్రున జనాల్లోకి దూసుకుపోయేలా వుంది. 

మరి ఇదే ఫిక్స్ చేస్తారో? లేదో? పరుచూరిప్రసాద్ నిర్మించే ఈ సినిమాకు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి సూపర్ సినిమాను అందించిన క్రాంతి మాధవ్ దర్శకుడు.

Show comments