సిక్స్‌ ప్యాక్‌ వార్తల్ని కొట్టిపారేసిన వెంకీ

బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన 'సాలా ఖదూస్‌' సినిమాని తెలుగులోకి వెంకటేష్‌ హీరోగా రీమేక్‌ చేయనున్న విషయం విదితమే. ఈ సినిమాలో తాను నటిస్తున్నట్లు ఇప్పటికే వెంకటేష్‌ ప్రకటించేశాడు. మరోపక్క, ఈ సినిమా కోసం వెంకటేష్‌, సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌ ట్రై చేస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ప్రచారం ఉత్తదేనని వెంకటేష్‌ స్పష్టం చేశాడు. 

బాక్సింగ్‌ నేపథ్యంలో సాగుతుంది 'సాలా ఖదూస్‌'. అయితే, అందులో బాక్సింగ్‌ ట్రైనర్‌గా కనిపించనున్న వెంకటేష్‌, ఇప్పుడున్న వెయిట్‌తోనే నటిస్తాడట. అయితే హెయిర్‌ పరంగా చిన్న చిన్న మార్పులు మాత్రమే చేయనున్నారు. ఒరిజినల్‌లో మాధవన్‌ నటించాడు. భారీ శరీరంతో మాధవన్‌ ఆ చిత్రంలో నటించాడు. 'సాలా ఖదూస్‌' బాలీవుడ్‌లో మంచి విజయాన్నే అందుకుంది. విమర్శకుల ప్రశంసలు దక్కాయి 'సాలా ఖదూస్‌' చిత్రానికి. 

మొత్తమ్మీద, తెలుగు వెర్షన్‌ కోసం వెంకటేష్‌ సిక్స్‌ ప్యాక్‌లో కన్పించాలనుకున్నా, ట్రైనర్లు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని సూచించడంతో, వెంకటేష్‌ ఆ ప్రయత్నాన్ని విమరించుకున్నాడని గుసగుసలు గుప్పుమన్నాయిగానీ, అదంతా ఉత్తదేనని వెంకటేష్‌ ఖండించేశాడు గనుక, సిక్స్‌ ప్యాక్‌ గాసిప్స్‌ రూలవుట్‌ అయిపోయినట్లే. 

Show comments