హైకోర్టు విభజనకు జగనే అడ్డంకా?

కొన్ని కొన్ని వినడానికి కాస్త ఆశ్చర్యంగా వుంటుంది కానీ, విన్న తరువాత కాస్త ఆలోచిస్తే నిజమోనేమో అని కూడా అనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన చిచ్చు ఇప్పుడు కాస్త చల్లారింది. సమస్యను పరిష్కరించే దిశగా గవర్నర్ కృషి ప్రారంభించారు. అయితే  అది నివురుగప్పిన నిప్పు మాత్రమే. ఎప్పుడు సెగలు కక్కుతుందో తెలియదు. 

అయితే ఇంతకీ చంద్రబాబు మాత్రం హైకోర్టు విభజనను ఎందుకు తాత్సారం చేస్తున్నారు. దానిని పరిష్కారానికి చొరవ ఎందుకు చూపడం లేదు. పదేళ్ల పాటు హైదరాబాద్ నుంచి పాలన సాగించే హక్కు ఉన్నా.. ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నా మొండి పట్టు పట్టి కోట్లాదిరూపాయలు ఖర్చుచేసి తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేసి మరీ... సచివాలయాన్ని తరలించిన చంద్రబాబు హైకోర్టు విషయంలో ఎందుకు చొరవచూపడం లేదు అన్న సందేహం అందరిలో కలగడం సహజమే.

దీనివెనుకు చంద్రబాబు రాజకీయ లబ్ది దాగుందన్న వదంతులు వినిపిస్తున్నాయి.  జగన్ ను దెబ్బతీయాలన్నా... వీలైతే అతగాడిని రాబోయే ఎన్నికల్లో కనిపించకుండా చేయాలన్నా కోర్టుల ద్వారానే సాధ్యం అన్నది బాబు ఆలోచనగా తెలుస్తోంది. అందుకే చంద్రబాబు హైకోర్టు విభజన విషయంలో మాత్రం పదేళ్ల ఉమ్మడి అంశాన్ని వాడుకుంటున్నాడంటున్నారు. ఇదెలా అంటే..

రాబోయే ఎన్నికల నాటికి కూడా ఏపీలో కాంగ్రెస్ కోలుకునేలా లేదు, బీజేపీ మరీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశాలు లేవు. పవన్ జనసేన వస్తుందో రాదో, వచ్చినా అది తెలుగుదేశంను ఢీ కొట్టే స్థాయిలో ఉండే అవకాశాలు తక్కువ. అలాంటప్పడు మరో టర్మ్ కూడా ఏపీ సిఎం చంద్రబాబు కావాలంటే ఎవరిని దెబ్బతీయాలి, ఎవరిపై పైచేయి సాధించాలి... అంటే అది కచ్చితంగా జగనే. జగన్ దెబ్బతీయాలంటే ఆయన వద్ద ఉన్న అస్త్రం జగన్ పై నమోదైన కేసులే. 

ఇవన్నీ తెలంగాణ పరిధిలోని హైకోర్టులో నమోదయి ఉన్నాయి. కోర్టు విభజన జరగితే ఈ కేసులన్నీ తెలంగాణ హైకోర్టు పరధికి బదిలీ అవుతాయి. అంటే తన అదికారం లేని మరో రాష్ట్రంలో జగన్ కేసుల విచారణ జరుగుతుంది. కాబట్టి తన ప్రభావం పనిచేయదు. కేసుల సాకుతో జగన్ ను అదుపు చేయడం కూడా ఇబ్బందిగానే మారుతుంది అని చంద్రబాబు బావిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ ఈ కేసులకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. కాని ప్రభావం చూపెట్టాలని ఆ రాష్ట్రం భావిస్తే... కోర్టు విభజన జరిగాక తెలంగాణ ప్రాంత న్యాయమూర్తులే జగన్ కేసుల విచారణకు నియమించబడితే పరిస్థితి ఎలా వుంటుందో తెలియదు. సాక్ష్యాధారా ప్రాతిపదికగానే తీర్పులు వెలువడతాయి. కానీ ఆ సాక్ష్యాధారాలు సమకూర్చవలసింది దర్యాప్తు సంఘాలు కదా..సిబిఐ అయినా దానికి మళ్లీ సహకరించాల్సింది రాష్ట్ర అధికారులే. ఏమయినా కొంతవరకు రాష్ట్రప్రభుత్వం తలుచుకుంటే ప్రభావితం చేసే అవకాశం అయితే వుందనే అనుకొవాలి. అందుకే బాబు వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. 

బాబుకీ సమస్యే

న్యాయమూర్తులను రాష్ట్రప్రభుత్వాలు ప్రభావితం చేయలేవు కానీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం దర్యాప్తులో కానీ, కేసుల పరిశోధనపై కానీ కొంతవరకు వుండే అవకాశం వుంది. ఓటుకు నోటు కేసు వ్యవహారం ఇలాంటిదే కదా. కేసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ వ్యవహారంలో నమోదైన కేసులన్నీ ఆంధ్రలోనే నమోదయ్యాయి. ఆ వ్యవహారానికి వ్యతిరేకంగా పలు ఆదేశాలు ఆంధ్రలోనే వెలువడ్డాయి. అందువల్ల ఓటుకు నోటు కేసు బతికి వున్నన్నాళ్లు బాబుకీ సమస్యే. ఆ కేసుల తెలంగాణ హైకోర్టు దగ్గరకు వస్తే, ఆంధ్ర హైకోర్టులో ఏదో ఒకటి చేసుకోవాలి.
 
ఇలా విభజన వల్ల చాలా సమస్యలు వస్తాయని బాబు భావించడం వల్లే ఈ మూడేళ్ల టర్మ్ పూర్తయ్యేవరకు హైకోర్టు విభజన జరగకుండానే చూస్తారని రాజకీయ వర్గాల్లో వదంతులు వినిపిస్తున్నాయి.

Show comments