ప్రేమమ్ గట్టెక్కేసినట్లే

సినిమా బాగున్నా, మంచి టాక్ వచ్చినా విడుదలైన తరువాత బుధవారం నాటికి బాక్సాఫీస్ దగ్గర డల్ అయింది ప్రేమమ్. దీంతో చాలామంది బయ్యర్లు కాస్త అప్ సెట్ అయ్యారు. ఇండస్ట్రీలో కూడా ప్రేమమ్ కు సరైన పబ్లిసిటీ చేయకుండా వదిలేస్తున్నారన్న కామెంట్ లు వినిపించాయి. మరి కాస్త పుష్ చేయాల్సిన అవసరం వుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. 

అయితే మలివారం వీకెండ్ మళ్లీ కలిసి వచ్చింది. దీంతో ప్రేమమ్ బయ్యర్లు చాలా ఏరియాల వారు సేఫ్ జోన్ కు చేరుకున్నారు. కొత్త సినిమా రావడానికి మరో మూడు రోజుల సమయం వుంది కాబట్టి వారు కూడా సేఫ్ జోన్ కు వచ్చేసే అవకాశాలు వున్నాయి.  దసరా సెలవులు, విడుదలైన తరువాతి వారం సరైన సినిమాలు ఏవీ లేకపోవడంతో ప్రేమమ్ పది రోజులకు 20 కోట్ల షేర్ సాధించింది వివరాలు.

వైజాగ్...1.96
ఈస్ట్.....1.08
వెస్ట్......0.81
కృష్ణ.....1.20
గుంటూరు..1.38
నెల్లూరు...0.59
సీడెడ్ ..2.32
నైజాం...5.11
కర్ణాటక..1.60
ఓఎస్...3.25

---------------------

టోటల్ 19.30

Show comments