ముద్రగడతో బాబు ఆటే ఆట

ఒకసారి వీక్ పాయింట్ తెలిసిపోతే..వీక్ నెస్ కనిపెట్టేస్తే ఓ రేంజ్ లో ఆడుకోవచ్చు..చంద్రబాబు సారథ్యంలో ప్రభుత్వం ముద్రగడ పద్మనాభంతో అలాగే ఆడుకుంటోంది. తొలిసారి దీక్ష ఓ రేంజ్ లో బదనామ్ అయితే, ఈసారి దీక్ష మరీనూ. పోలీస్ స్టేషన్ లో నిరశన అంటే..వ్యాన్ లో కూర్చోపెట్టారు. వ్యాన్ లో దీక్ష అంటే ఇంట్లోకి వెళ్లేలా చేసారు. ఇంట్లో దీక్ష అంటే తీసుకెళ్లి ఆసుపత్రిలో వుంచారు. దీక్షను పట్టించుకోవడం మానేసారు. 

పోలీసు బలం ఉపయోగించి ఎవర్నీ కలవనివ్వలేదు. మీడియా బలం ఉపయోగించి వార్తలు బయటకు రాకుండా చేసారు. వార్తలు అందించే మీడియాను రాకుండా చేసారు. మద్దతుగా వస్తాం అనేసరికి దాసరి, చిరు మీద అటాక్ స్టార్ట్ చేసారు. ఇలా ఎక్కడికక్కడ కట్టడి చేసి, దీక్ష చేసుకుంటే చేసుకోమన్నారు.  ఎవరి బెయిల్ వాళ్లు తెచ్చుకుని బయటకు వచ్చారు. వాళ్లు వచ్చాక, కలిసి దీక్ష విరమిస్తా అనాల్సి వచ్చింది. అవునా..అని వాళ్లను కలవనివ్వకుండా చేసారు. కలవకుండానే దీక్ష విరమించాల్సిన పరిస్థితి. 

ఏదో పాయింట్ అన్నట్లుగా పోలీసు వాహనంలోనే దింపాలని అని ఓ చిన్న పాయింట్.. ఠాట్ అదీ కుదరదు అంది.. సరే మా బళ్లలో మేమే వెళ్తాం అన్నారు.  ఇలా ముద్రగడ కోరింది ఏదీ సాగకుండా, దీక్షను ఆయన అంతట ఆయనే విరమించేలా చేసారు. దీనికి రెండు కారణాలు ఒకటి అధికార బలం దానికి తోడయిన మీడియా అండదండలు. రెండవది కాపుల్లో కానరాని ఐక్యత దానికి తోడయిన ముద్రగడ రాజకీయ వ్యూహారాహిత్యం. 

Show comments