రాశి ఖన్నా 'హైపర్‌' గ్లామర్‌

తొలి సినిమా 'ఊహలు గుసగుసలాడే'లో కాస్త అటూ ఇటూగా కన్పించినా, ఆ తర్వాతి నుంచీ రాశి ఖన్నా వీలున్నప్పుడల్లా గ్లామర్‌తో దడదడలాడించేస్తూనే వుంది. సినిమా సినిమాకీ గ్లామర్‌ విషయంలో హద్దులు చెరిపేసుకుంటూ వస్తోన్న ఈ బబ్లీ బ్యూటీ తాజాగా 'హైపర్‌' సినిమా కోసం గ్లామర్‌ డోస్‌ ఇంకాస్త ఎక్కువే పెంచేసినట్లుంది. 

'హైపర్‌' సినిమాలోనే కాదు, 'హైపర్‌' సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లోనూ రాశి ఖన్నా తన గ్లామర్‌తో అందర్నీ విపరీతంగా ఎట్రాక్ట్‌ చేసింది. ఇక, ట్రైలర్‌ విషయానికొస్తే ముందుగా రాశి ఖన్నా గ్లామర్‌ గురించే చెప్పుకోవాలేమో. 'ట్రయల్‌ రూమ్‌లో ఓ ట్రైలేసుకుంటావా..' అని హీరోని ఉద్దేశించి ఆమె అడిగే డైలాగ్‌ క్షణాల్లో పాపులర్‌ అయిపోతుందనడం అతిశయోక్తి కాదు. 

షరామామూలుగానే రామ్‌ సినిమాల్లో వుండే హైపర్‌ యాక్షన్‌ ఇందులోనూ వుంటుందనే విషయం ట్రైలర్‌ని చూస్తే ఇట్టే అర్థమవుతోంది. 'నాన్నంటే ప్రేమ, అభిమానం కాదు.. పిచ్చ..' అని రామ్‌ హై ఓల్టేజ్‌తో చెప్పే డైలాగ్‌ ఈ ట్రైలర్‌లో కాస్త డిఫరెంట్‌గా వుందనుకోవాలేమో.! 'శివమ్‌' సినిమా తర్వాత రామ్‌, రాశి ఖన్నా కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఇది. సంతోష్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకుడు. 

Show comments