కనీసం ఇంత సేపు సెక్స్‌.. పార్ట్‌ నర్‌ ఫుల్‌ హ్యాపీ!

ఎంతసేపు..? సెక్స్‌ విషయంలో ఇదో మిస్టరీ. పరస్పరం ఓపెనప్‌ అయ్యే వారిని పక్కన పెడితే.. సెక్స్‌ విషయంలో యాంగ్జైటీతో ఉండే వారికి ఇది సమాధానం లేని ప్రశ్నే. ఎవరినీ అడగడం కుదరదు.. పోర్న్‌ చూసో.. ఇంకోటి చూసో తెలుసుకుందామంటే అవి వాస్తవానికి చాలా దూరంగా ఉంటాయి. మరి ఇలాంటి మిస్టీరియస్‌ ప్రశ్నకే కొన్ని కొన్ని సర్వేలు కాస్త సంబద్ధమైన సమాధానాలు ఇస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిలో ఇదీ ఒకటి. లవ్‌ హనీ అనే ఆన్‌ లైన్‌ సెక్స్‌ టాయ్స్‌ సంస్థ చేసిన అధ్యయనంలో యావరేజ్‌ సెక్స్‌ టైమ్‌ గురించి ఆసక్తికరమైన వివరాన్ని పేర్కొన్నారు. ఆ మాత్రం సమయం బెడ్‌ మీద శృంగార కార్యానికి కేటాయిస్తుంటే.. మీ సంగతెలా ఉన్నా మీ పార్ట్‌నర్‌ ఆనందంగా ఉన్నట్టే అని ఈ అధ్యయనం అభిప్రాయపడింది.

దీని ప్రకారం 19 నిమిషాలు.. ఇదీ యావరేజ్‌ సెక్స్‌ టైమ్‌. ఇంతసేపు శృంగార కార్యంలో ఉన్న జంటలు ఆనందంగా ఉన్నట్టేనని లవ్‌ హనీ పేర్కొంది. రొమాంటిక్‌ రిలేషన్‌ షిప్‌లో సెక్స్‌ చాలా కీలకమైనది.. ఎంత తరచుగా ఈ టచ్‌ ఉంటే అంత మంచిది, అలా టచ్‌ చేసుకున్నప్పుడు ఎంతసేపు ఈ రొమాంటిక్‌ రైడ్‌ను కొనసాగించాలంటే.. 19 నిమిషాలు అని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. ఈ పంతొమ్మిది నిమిషాల అనేది మొత్తం సెక్సీ టైమ్‌.

దీన్ని వేరుచేసి చూస్తే... 10 నిమిషాల పాటు ఫోర్‌ ప్లే అని, మిగిలిన తొమ్మిది నిమిషాలూ యాక్చువల్‌ ఇంటర్‌ కోర్స్‌కు కేటాయించాలని ఈ అధ్యయనం పేర్కొంది. దాదాపు 4,400 జంటలను సర్వేచేసి ఈ అధ్యయనం చేసిందట లవ్‌ హనీ. 'ఎంతసేపు..?' అనే అంశంపై వారందరి అభిప్రాయాలనూ తీసుకుని కనీసం 19 నిమిషాలు అనే అంచనాకు వచ్చినట్టుగా ఈ అధ్యయన సంస్థ పేర్కొంది.

Show comments