వర్మ శిష్య రత్నం.. చిన్నపిల్లతో రొమాన్స్!

ఒకప్పుడు రాంగోపాల్ వర్మ వద్ద దర్శకత్వ విభాగంలో పని చేసిన నేపథ్యం ఉన్న వ్యక్తి అనురాగ్ కశ్యప్. ఆ తర్వాత తనకంటూ ఒక కంపెనీ పెట్టుకున్నాడు. కొన్ని సినిమాలతో ప్రశంసలను మరికొన్ని సినిమాలతో విమర్శలను ఎదుర్కొంటూ సాగుతున్నాడు.

ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. వర్మ కన్నా టెర్రరిస్టులా తయారైనట్టుగా ఉన్నాడితను. వర్మ ఒక పెళ్లి చేసుకుని.. విడాకులతో దాన్ని తెంచేసుకుని.. మళ్లీ పెళ్లి జోలికి వెళ్లలేదు, తన బతుకేదో తను బతికేస్తున్నాడు. అనురాగ్ మాత్రం ఇప్పుడు మూడో పెళ్లికి రెడీ అయిపోయినట్టుగా కనిపిస్తున్నాడు.

ఇది వరకూ అనురాగ్ కు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. తొలి భార్యతో విడాకుల అనంతరం నటి కల్కీ కొచ్లిన్ ను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా విడాకులు ఇచ్చేసి ఇటీవలే సింగిల్ అయ్యాడు. కానీ ఇంతలోనే మరో అమ్మాయితో సన్నిహితంగా మెలుగుతూ ఫొటోలు నెట్ లో పెట్టాడు.

ఈమె పేరు శుభ్రా షెట్టి. అనురాగ్ ఫిల్మ్ మేకింగ్ కంపెనీలోనే పని చేస్తోందట. వీరిద్దరూ ఇప్పుడు ప్రేమికులు అయ్యారు. చోద్యం ఏమిటంటే.. ఆ పిల్ల వయసు 22 సంవత్సరాలు. అనురాగ్ వయసు 44 సంవత్సరాలు.

ఇతడికి తొలి వివాహంతో కలిగిన కూతురు కన్నా కొంచెం పెద్దది అంతే. ఈ ముదురు దర్శకుడు ఆ పిల్లతో రొమాన్స్ చేస్తూ ఏకంగా నెట్లో ఫొటోలు కూడా పెట్టేస్తున్నాడు. వీళ్లు కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారట.. ప్రేమలో మునిగి తేలుతున్నారట. మరి ఈ కథ ఎక్కడి వరకూ వెళ్తుందో చూడాలి.

Show comments