శర్వా సరసన మెహరీన్

యువి క్రియేషన్స్ సంస్థ డైరక్టర్ మారుతి కాంబినేషన్ లో శర్వానంద్ హీరోగా ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారు. వాటిలో మెహరీన్ పేరు టాప్ న వునట్లు బోగట్టా. ఈ అమ్మాయి తెలుగులో నాని సరసన కృష్ణగాడి వీర ప్రేమగాధలో నటించింది. 

ఆ తరువాత తెలుగు సినిమాలు ఏవీ ఓకె చేయలేదు. బాలీవుడ్ లో ఓ ప్రాజెక్టు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈమెను తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ మెహరీన్ ఫిక్స్ కాకపోతే, కొత్త ఫేస్ లు కూడా పరిశీలించాలని అనుకుంటున్నారు. ఇంకోపక్క ప్రగ్య జైస్వాల్ పేరు కూడా పరిశీలనలో వుంది.

ఈ సినిమా డిసెంబర్ నెలాఖరు నుంచి సెట్ మీదకు వెళ్లే అవకాశం వుంది. ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న శతమానం భవతి, టాకీపార్ట్, సాంగ్స్ ఆ వేళకు ఫినిష్ అయిపోతాయి. ఆ సినిమా సంక్రాంతికి విడుదలవుతుంది.

Show comments