'షార్ట్‌' లిప్‌లాక్‌తో పాపులారిటీ వచ్చేనా.?

శ్వేతా బసు ప్రసాద్‌.. తెలుగు ప్రేక్షకులకి 'ఎకడా..' అన్న డైలాగ్‌తో మాంఛి కిక్‌ ఇచ్చిన ఈ బ్యూటీ, ఆ తర్వాత తెలుగు తెరపై ఫేడవుట్‌ అయిపోయింది. తొలి చిత్రం 'కొత్త బంగారు లోకం' తప్ప, ఆమెకు తెలుగులో ఇంకో సక్సెస్‌ దక్కలేదు. అయితే, ఆ తర్వాత ఆమె వివాదాస్పదంగా వార్తల్లోకి ఎక్కిందనుకోండి.. అది వేరే విషయం. 

ప్రస్తుతం తెలుగు తెరపై పెద్దగా కన్పించడంలేదుగానీ, బాలీవుడ్‌లో మాత్రం స్క్రిప్ట్‌ కన్సల్టెంట్‌గా అవకాశం దక్కించుకుంది. అనురాగ్‌ కశ్యప్‌ టీమ్‌లో పనిచేస్తున్న శ్వేతా బసు ప్రసాద్‌ తాజాగా ఓ షార్ట్‌ ఫిలింలో నటించింది. 'ఇంటీరియర్‌ కేఫ్‌ నైట్‌' పేరుతో రూపొందిన ఈ షార్ట్‌ ఫిలింలో శ్వేతా బసు ప్రసాద్‌ నటనకి మంచి మార్కులు పడ్తున్నాయి. కేవలం నటన మాత్రమే కాదు, లిప్‌ లాక్‌తోనూ హల్‌చల్‌ చేసేసింది ఈ షార్ట్‌ ఫిలింలో శ్వేతా బసు ప్రసాద్‌. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నసీరుద్దీన్‌ షా ఈ షార్ట్‌ ఫిలింలో ముఖ్య పాత్రలో కనిపించాడు. 

Watch Interior Cafe Night Short Film

ఇదిలా వుంటే, షార్ట్‌ ఫిలింలో భావోద్వేగాల్ని మాత్రమే చూడాలనీ, ఆ లిప్‌ లాక్‌ సీన్‌లో అసభ్యత ఏమీ లేదని శ్వేతా బసు ప్రసాద్‌ చెబుతోంది. కాన్సెప్ట్‌ నచ్చడంతోనే షార్ట్‌ ఫిలింకి అంగీకరించానంటున్న శ్వేత, నసీరుద్దీన్‌ షా వంటి సీనియర్‌తో కలిసి వర్క్‌ చేసే అవకాశం రావడం తన అదృష్టమని అంటోంది.

Show comments